Unique Village in India: మన దేశంలో ఈ గ్రామం ప్రత్యేకం.. రెండు దేశాల పౌరసత్వం.. గ్రామ పెద్దకు 60 భార్యలు..
భారతదేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉన్నాయి. అయితే దేశంలో ఒక గ్రామం రెండు దేశాలకు చెందిందిగా ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు తిండి ఒక దేశంలో.. నిద్ర ఒక దేశంలో అన్నట్లుగా రెండు దేశాలుగా విభజించబడింది. ఈ గ్రామానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక్కడి అధినేతకు ఒకరిద్దరు కాదు మొత్తం 60 మంది భార్యలు.
Updated on: Nov 10, 2022 | 12:00 PM

దేశంలో పట్టణీకరణ రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ, నేటికీ దేశంలోని అత్యధిక జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉన్నాయి. అయితే దేశంలో రెండు దేశాలుగా విడిపోయిన ఒక గ్రామం కూడా ఉందని మీకు తెలుసా. ఈ గ్రామానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ గ్రామం గురించి తెలుసుకుందాం...

ఈ గ్రామం పేరు లాంగ్వా, ఇది నాగాలాండ్‌లో ఉంది, అయితే ఈ గ్రామానికి చెందిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో ఒక భాగం భారతదేశంలో.. మరొక భాగం మయన్మార్‌లో ఉంది. అందుకే ఆ ఊరి ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం వచ్చింది. మయన్మార్‌లో ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా సంచరించవచ్చు.

లాంగ్వా గ్రామ పెద్ద ఇంటి మధ్య నుంచి అంతర్జాతీయ సరిహద్దు వెళుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లాంగ్వా గ్రామ ప్రజలు ఒక దేశంలో తింటే.. మరొక దేశంలో నిద్ర పోతున్నారని అంటున్నారు.

ఈ గ్రామాధికారిని 'అంగ' అని పిలుస్తారు. నిజానికి.. అతను ఇక్కడ వంశపారంపర్య పాలకుడు. మీడియా కథనాల ప్రకారం.. లాంగ్వా గ్రామాన్ని మాత్రమే కాదు.. అతని పాలన భారతదేశం, మయన్మార్‌లో ఉన్న దాదాపు 70 గ్రామాల్లో నడుస్తుంది.

ఊరి పెద్దకు ఒకరో ఇద్దరో కాదు మొత్తం 60 మంది భార్యలున్నారు. అంటే అతను 60 పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటారు. ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు కొన్యాక్ తెగ నుండి వచ్చారు. ఈ తెగను గతంలో హెడ్‌హంటర్ తెగ అని పిలిచేవారని తెలుస్తోంది.





























