AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahua Liquor: ఇప్ప సారా తప్పతాగిన ఏనుగులు.. మైకంలో కుంభకర్ణుడిలా నిద్ర.. లేపడానికి అధికారుల తంటా

అడవికి సమీపంలో నివసిస్తున్న గ్రామస్థులు..ఇప్ప పువ్వు సారాయి తయారీకోసం అడవిలో పెద్ద పెద్ద కుండలను ఏర్పాటు చేశారు. సారాయి కోసం ఇప్ప పువ్వులను పెద్ద పెద్ద కుండల్లో పులిబెట్టారు. ఈ నేపథ్యంలో తాము ఉంచిన కుండల కోసం వెళ్లిన గ్రామస్థులకు అక్కడ మద్యం తాగి ఉన్న ఏనుగులు కనిపించాయి.

Mahua Liquor: ఇప్ప సారా తప్పతాగిన ఏనుగులు.. మైకంలో కుంభకర్ణుడిలా నిద్ర.. లేపడానికి అధికారుల తంటా
Keonjhar Forest Department
Surya Kala
|

Updated on: Nov 10, 2022 | 9:52 AM

Share

మద్యం అంటే మనుషులకే కాదు.. మాకు కూడా మక్కువే అంటున్నాయి కొన్ని ఏనుగులు.. అడవిలో తయారు చేస్తున్న విప్పపువ్వు సారాయి గుట్కాయిస్వాహా చేసి..  ఆ మత్తులో హ్యాపీగా ఒళ్ళు తెలియకుండా అక్కడే నిద్రపోయాయి.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఏనుగులను మేల్కొలపడానికి అష్టకష్టాలు పడ్డారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు సంప్రదాయ దేశీ మద్యం ఇప్ప పువ్వు ( ‘మహువా’) సారాను తయారు చేసేందుకు అడవిలోకి వెళ్లారు. అయితే ఏనుగుల గుంపు అప్పటికే ఇప్ప పువ్వులను పులియబెట్టిన నీటిని తాగి.. గాఢనిద్రలో ఉన్నట్లు గుర్తించారు.

కియోంఝర్ జిల్లాలోని శిలిపాడ జీడిపప్పు అడవికి సమీపంలో నివసిస్తున్న గ్రామస్థులు..ఇప్ప పువ్వు సారాయి తయారీకోసం అడవిలో పెద్ద పెద్ద కుండలను ఏర్పాటు చేశారు. సారాయి కోసం ఇప్ప పువ్వులను పెద్ద పెద్ద కుండల్లో పులిబెట్టారు. ఈ నేపథ్యంలో తాము ఉంచిన కుండల కోసం వెళ్లిన గ్రామస్థులకు అక్కడ మద్యం తాగి ఉన్న ఏనుగులు కనిపించాయి. మొత్తం 24 ఏనుగులు ఇప్ప పువ్వు పులియబెట్టిన పెద్ద కుండలు ఉన్న ప్రదేశంలో నిద్రిస్తున్నట్లు చూశారు. ఇదే విషయంపై గ్రామస్థులు స్పందిస్తూ.. తాము మహువా సిద్ధం చేయడానికి ఉదయం 6 గంటలకు అడవిలోకి వెళ్ళామని కుండలన్నీ పగలగొట్టబడి ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు కుండల్లో ఇప్ప పువ్వుని పులియబెట్టిన నీరు కనిపించలేదని పేర్కొన్నారు. అక్కడ తాము ఏనుగులు నిద్రపోతున్న విషయం తెలుసుకున్నామని అవి పులియబెట్టిన నీటిని తగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ 24 ఏనుగుల్లో తొమ్మిది ఏనుగులు మగవి, ఆరు ఆడవి మిగిలిన తొమ్మిది ఏనుగులు పిల్లలు ఉన్నాయి.

“అయితే ఈ మద్యం ప్రాసెస్ చేయలేదు.. తాము ఆ ఏనుగులను మేల్కొలపడానికి ప్రయత్నించాము..  విఫలమయాని.. దీంతో వెంటనే ఈ విషయాన్ని  పటానా అటవీ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల మందను నిద్ర లేపేందుకు డప్పులు కొట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏనుగులు అడవిలోపలికి వెళ్లాయని అటవీశాఖ అధికారి ఘాసిరామ్ పాత్ర తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉదయం 10 గంటల ప్రాంతంలో మంద అక్కడి నుంచి వెళ్లిపోయిందని సేథి చెప్పారు. అయితే ఏనుగులు పులియబెట్టిన ఇప్ప సారాను తాగాయో  లేదో తమకు ఖచ్చితంగా తెలియదని అటవీ అధికారికి చెప్పారు.

మరోవైపు పగిలిన కుండలకు సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మత్తులో నిద్రిస్తున్న ఏనుగులను గుర్తించామని గ్రామస్తులు చెబుతున్నారు. మహువా అని  పిలువబడే ఇప్ప పువ్వు మద్య పానీయాన్ని ఉత్పత్తి చేయడానికి పులియబెడతారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో గిరిజన పురుషులు, మహిళలు ఈ  సాంప్రదాయక మద్యాన్ని తయారు చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..