గాల్లోనే సైనికుడి ప్రాణాలు కాపాడిన నర్స్‌.. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుకు అర్థం చెప్పిన గీతకు ప్రశంసలు..

2020లో జరిగిన వర్చువల్ వేడుకలో గీతకు ఫ్లోరెన్స్ నైటింగేల్ మెడల్ లభించింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా వేడుకను ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చింది. ఆమె, ఇతర గత విజేతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవించటానికి ఢిల్లీకి ఆహ్వానించారు.

గాల్లోనే సైనికుడి ప్రాణాలు కాపాడిన నర్స్‌.. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుకు అర్థం చెప్పిన గీతకు ప్రశంసలు..
Florence Nightingale
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 10, 2022 | 11:10 AM

తన పనికి గౌరవం పొందేందుకు ప్రయాణిస్తున్న భారతీయ నర్సు విమానంలో తన సహ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడినందుకు ప్రశంసలు అందుకుంది. నర్సుల కోసం ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు విజేతలను సన్మానించే కార్యక్రమంలో పాల్గొనేందుకు పి. గీతా దక్షిణాది రాష్ట్రం కేరళ నుండి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతోంది. అయితే, విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత క్యాబిన్ సిబ్బంది వైద్య సహాయం కోరుతూ ప్రకటన చేశారు. భారత ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌కు వెళుతున్న సైనికుడు సుమన్ హార్ట్ఎటాక్తో తను కూర్చున్న సీటులోనే కూలబడిపోయాడు..అతని పల్స్ కూడా పడిపోయింది. విషయం తెలుసుకున్న గీత చాకచక్యంగా వ్యవహరించి అతడి ప్రాణాలను కాపాడింది.

కేరళకు చెందిన ఫ్లోరెన్స్ నైన్టీగల్ అవార్డు 2022 గ్రహీత పి.గీత విమాన మార్గం మధ్యలో ఓ సైనికుడి ప్రాణాలను కాపాడారు. గుండెపోటుకు గురైన నిలంబూరుకు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి సీపీఆర్ అందించి అతని ప్రాణాలను కాపాడారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు గీత కన్నూర్ నుంచి ఎయిరిండియా విమానంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నర్సుల కోసం ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు విజేతలను సన్మానించే కార్యక్రమంలో పాల్గొనేందుకు పి. గీతా దక్షిణాది రాష్ట్రం కేరళ నుండి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నారు.

విమానం టేకాఫ్ అయిన తర్వాత మార్గమధ్యంలో సుమన్ అనే 32 ఏళ్ల సైనికుడు గుండెపోటుకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. అప్పుడు స్టీవార్డ్ ముస్తపా విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా..? అని ఆరా తీశారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ మాజీ నర్సింగ్ సూపరింటెండెంట్ పి. గీత చికిత్స అందజేశారు. సుమన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించగా అతడి బీపీ, పల్స్ రేటు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత సీపీఆర్ ప్రారంభించి యువకుడి ప్రాణాలను కాపాడారు. మాజీ రాష్ట్ర సామాజిక భద్రతా మిషన్ డైరెక్టర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ-న్యూఢిల్లీ నేషనల్ ప్రొఫెషనల్ ఆఫీసర్ మహ్మద్ అషీల్‌తో సహా చాలా మంది వైద్యులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారి అన్ని ప్రయత్నాలతో సుమన్ బతికిపోయాడు.

ఇవి కూడా చదవండి

CPR ఇచ్చి తన ప్రాణాలను కాపాడిన ‘ఫ్లోరెన్స్ నైటీగెలాల్’ అవార్డు గ్రహీత గీత ఈ సంఘటన గురించి మాట్లాడుతూ, ‘విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక ప్రయాణికుడు కుప్పకూలిపోయాడని చెప్పారు. అంతలో సిబ్బంది..అడిగారు..అందుబాటులో డాక్టర్లు, నర్సులు ఉన్నారా అని అడిగారు. హడావిడిగా అటెండ్ అయ్యాను. రోగి పల్స్, బీపీ కూడా లేవు. సిబ్బందితో కలిసి CPRని ప్రారంభించాము. CPR తీసుకున్న తర్వాత అతను శ్వాస తీసుకోగలిగాడు. విమానంలోనే ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అతన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అతడు సైనికుడు అంటూ వివరించింది గీతా. అంతే కాదు సుమన్‌కి మొదట్లో ట్రీట్‌మెంట్ ఇవ్వడం కష్టమని సీపీఆర్ ద్వారా పల్స్ రేటు తెలిసింది. తర్వాత తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. దీనికి డా. ప్రేమ్ కుమార్, డా. ఆశీల్‌ సహకరించారు. ఢిల్లీకి వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చేంత వరకు ఆయన దగ్గరే ఉన్నాం. గీత తన భర్త పి. సత్య ప్రకాష్ కూడా అక్కడే ఉన్నాడు.

2020లో జరిగిన వర్చువల్ వేడుకలో గీతకు ఫ్లోరెన్స్ నైటింగేల్ మెడల్ లభించింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా వేడుకను ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చింది. ఆమె, ఇతర గత విజేతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవించటానికి ఢిల్లీకి ఆహ్వానించారు.

గీతా గీత 2020లో జాతీయ అవార్డును గెలుచుకుంది . 2018లో కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. 2018- 2019లో రాష్ట్రంలో సంభవించిన భారీ వరదల సమయంలో కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో గీత విపత్తు నిర్వహణ కార్యకలాపాల్లో పాల్గొంది.

2019లో, గీత కేరళలో ఉత్తమ నర్సు అవార్డును గెలుచుకుంది. ఆమె కోజికోడ్‌లోని ఉత్తర జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా పనిచేశారు. ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన ఆమె ప్రస్తుతం కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి