ఓ నవ్వు చాలు.. అన్ని సమస్యలు దూరం..

26 March 2025

TV9 Telugu

నిత్యం నవ్వడం వల్ల కండరాలు విశ్రాంతి పొంది, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించి బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.

నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆయుష్షును పెంచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

నవ్వుతున్న సమయంలో బ్రెయిన్‌లో డోపమైన యాక్టివేట్ అవుతుంది. ఇది శరీరంలో యాంటీ బాడీల ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

నవ్వు మెరుగైన వాస్క్కులర్‌ పనితీరు ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఎక్కువగా నవ్వడం వల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చవుతాయి. ఒత్తిడి కలిగించే కార్టిసోల్‌ విడుదల కాకుండా చూస్తుంది.

ఇక శరీరంలో ఏర్పడే అన్ని నొప్పులను తగ్గించే శక్తి కూడా నవ్వుకు ఉందని నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.

నవ్వే సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్స్‌ ఒళ్లు నొప్పులను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.