స్వీట్‌కార్న్‌లో న్యూట్రన్స్ కారణంగా తక్షణ శక్తి లబిస్తుంది. అంతేకాదు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.
స్వీట్‌కార్న్‌లో ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ మెగ్నీషియం, ఫాస్ఫరస్ శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది.
స్వీట్‌కార్న్‌లో ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో అవశ్యకంగా మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది. స్వీట్ కార్న్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే జియాంథీన్, లుటీన్ కంటి సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.
స్వీట్ కార్న్ లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మంపై కొల్లజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. చర్మం సాగే గుణానికి సహకరిస్తాయి ఇంకా వృద్ధాపచాయలు త్వరగా రావు.
బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో స్వీట్‌కార్న్‌ను తప్పకుండా చేర్చుకోవాలి. వాటిలో ఉండే ఫైబర్ కారణంగా మనం కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
స్వీట్‌కార్న్‌లో ఉండే ఫోలెట్ రక్తనాళాలలోని హోమోసిస్టీన్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె వ్యాధుల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో ఉంటుంది. అందుకే ఇది తిన్న వెంటనే శరీరానికి శక్తి అందుతుంది.