పెరుగు తింటే బరువు పెరుగుతారని భయపడేవారు పెరుగులో కొంచెం జీలకర్ర పొడి కలుపుని తినాలి. బరువు పెరగడం అనే భయం ఉండదు.
గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు కప్పు పెరుగులో నల్ల ఉప్పుని వేసుకుని తీసుకోవడం ఉత్తమ ఫలితాని ఇస్తుంది.
దంత సమస్యలు, నోటి పూతతో ఇబ్బడి పడేవారు కప్పు పెరుగులో కొంచెం వాము కలుపుకుని తినడం వలన దంత సమస్యలు తగ్గుతాయి.
నీరసం, అలసటగా అనిపిస్తే పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తిన్న ఆహారం జీర్ణం అవడంతో ఇబ్బంది పడేవారు కప్పు పెరుగులో మిరియాల పొడిని కలిపి తింటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగులో పసుపు, అల్లం కలిపి తింటే ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది గర్భిణీ మహిళలకు, చిన్నారులకు ఎంతగానో మేలు చేస్తుంది.
కప్పు పెరుగులో తేనె కలిపి తీసుకుంటే అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీంతో శరీరంలోని ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.