Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం ఖర్మ.. చదువుకున్నోళ్లు వేశారు చెల్లని ఓట్లు..! ఎమ్మెల్సీ ఓటింగ్ లో వేలకు వేలు..

పట్టభద్రులే కాదు.. ఉపాద్యాయులు కూడా మేము సైతం అన్నట్టుగానే కనిపించారు. తమ బ్యాలెట్ పేపర్ లో కవితలు రాసేసి.. పిచ్చి‌పిచ్చి గీతలు గీసేసి ఓటేశారు. చివరికి హోరాహోరీ పోరులో చెల్లని ఓట్లలలోని నాలుగవ శాతం ఓట్లతో గెలుపు నిర్ణయం అయింది. అదే ఈ ఓట్లలలో కనీసం 50 శాతం ఓట్లు సరిగ్గా పడున్నా ఫలితం మరోలా ఉండేదేమో అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇదేం ఖర్మ.. చదువుకున్నోళ్లు వేశారు చెల్లని ఓట్లు..! ఎమ్మెల్సీ ఓటింగ్ లో వేలకు వేలు..
Invalid Votes
Follow us
Naresh Gollana

| Edited By: Jyothi Gadda

Updated on: Mar 06, 2025 | 10:26 AM

పుస్తకాలకు పుస్తకాలు తిరగేసి.. ఉన్నత చదువులు చదివేసి పట్టభద్రులమయ్యామని జబ్బలు చర్చేసుకుంటున్న ఉన్నత అక్షరాస్యుల తీరు ఇప్పుడు ముక్కు‌మీద వేలేసుకునేలా చేస్తోంది. హోవ్వా.. మీకంటే మా నిరక్షరాస్యులే నయం కదా సార్లు అనేలా ఇటు ఉపాధ్యాయుల తీరు‌ అటు పట్టభద్రుల తీరు కనిపించింది. గంటల తరబడి క్యూ లైన్లలలో నిలుచుని పోటీ పడి మరీ మీరేసిన ఓట్లు ఇలా కుల్లిపోయేందుకా అని నిలదీస్తోంది‌ సమాజం. అంచనాలను‌ తారుమారు చేసేలా అభ్యర్థుల ఆశలను ఆవిరి‌చేసేలా సాగిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పుడు ఆ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అవగాహన లేకనో.. అసలు ఓటు‌ వెయ్యడం కూడా చాతకాకనో అన్నట్టు సాగిన చెత్త ఓటర్లపైనే ఈ చర్చ. అడవుల జిల్లా ఆదిలాబాద్ అమాయకత్వానికి మచ్చ తెచ్చేలా చెల్లని ఓటర్ ఇచ్చిన తీర్పిది.

ఉమ్మడి ఆదిలాబాద్.. అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్. అక్షరాస్యత కూడా అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు ఆ నిరక్ష్య రాస్యులే నయం అనేలా కనిపిస్తోంది ఆ జిల్లాలో పోలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల తీరు‌చూస్తుంటే. భారీ ఎత్తిన‌ పోలింగ్ స్టేషన్ లకు పోటెత్తి అభ్యర్థుల ఆశలను అమాంతం పెంచేసేలా ఓటింగ్ లో పాల్గొన్నారు‌ కూడా. తీరా బ్యాలెట్ బాక్స్ లో ఓపెన్ చేస్తే కానీ తెలియ లేదు పట్టభద్రుల మేదావి తనం. బాగా చదువుకున్నోల్లు కదా.. ఆచితూచి ఓటేస్తారని అందరూ ఆశించారు. కానీ బాక్సులు బద్దలయ్యేలా అంచనాలు తలకిందులయ్యేలా ఒక్కో ఓటు చెత్త బుట్టలోకి వెళుతుంటే అభ్యర్థుల ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. కరీంనగర్ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవడమే ఆలస్యం చెల్లిన ఓట్ల‌కంటే చెల్లు బాటుకానీ ఓట్లే ఎక్కువగా తెర పైకి రావడం ఆందోళనకు కారణమైంది.

ఉమ్మడి కరీంనగర్ , ఆదిలాబాద్ , నిజామాబాద్ , మెదక్ జిల్లాల పరిదిలో సాగిన పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. పోలీన ఓట్లలో 11 శాతం పైగా ఓట్లు చెత్త బుట్టల్లోకి చేరిపోయాయి. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 355159 మంది ఓటర్లుండగా 250106 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ నుండి 69134 ఓట్లకు గాను 48195 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇందులో 21 శాతం మంది అంటే 10120 మంది ఓట్లు చెత్త బుట్టలోకి చేరినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో‌కలిపి 28686 ఓట్లు అంటే దాదాపు 11.38 శాతం ఓట్లు చెత్తబుట్టలోకి చేరిపోయాయి. అందులోను మంచిర్యాల , నిర్మల్, కరీంనగర్ , నిజామాబాద్ లాంటి అభివృద్దిలో దూసుకు పోతున్న జిల్లాల్లో ఓటేసిన పట్టభద్రుల ఓట్లే ఎక్కువగా కుల్లిపోయిన ఓట్ల జాబితాలో ప్రత్యక్షమవడం పట్టభద్రుల తెలివి తక్కువ తనానికి అద్దం పడుతోంది. ఒక్క ఓటు కూడా కీలకమే బ్రదర్ అనేలా సాగిన పెద్దల ఓట్ల పండగలో ఇలా చెత్త తెలివిని ప్రదర్శించిన చెల్లని ఓటు వేసిన ఓటర్ల తీరును నడి చౌరస్తారో కడిగేస్తున్నారు జనం.

ఇవి కూడా చదవండి

మరోవైపు అవగాహన కల్పించడంలో ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఈ చెల్లని ఓట్లను చూస్తుంటే అర్థమవుతోంది. కనీసం ఓటర్ స్లిప్లను కూడా ‌పంచనంత నిర్లక్ష్యంతో వ్యవహరించిన ఈసీ.. సోషల్ మీడియాలో ఏవో నాలుగు వీడియోలను రిలీజ్ చేసి చేతులు దులుపుకుందని.. ఈకారణంగానే ఈ తీరున చెత్తబుట్టలోకి చేరిపోయిన ఓట్లు దర్శనమిచ్చాయని తెలుస్తోంది. అటు ఉపాద్యాయ ఓటర్లు సైతం అడ్డదిడ్డంగా ఓటేయడం చర్చనీయాంశం అయింది. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికలో సుమారు 28 వేలకు పైగా ఓట్లు చెల్లుబాటు కాకపోగా.. చెల్లని ఓట్లలో చాలా మటుకు అవగాహన లేకపోవడంతోనే ఇలా పరిస్థితి తగలడిందని తెలుస్తోంది. ప్రాధాన్యత ఓట్లు వేయడంలో కొందరు తప్పుడు పద్ధతిని అనుసరిస్తే మరికొందరు తమ అభ్యర్ధిపై అతిప్రేమతో రకరకాల వ్యాఖ్యలు రాయడం ఇప్పుడు ఓటు చెల్లకుండా పోయే పరిస్థితిని తీసుకొచ్చింది.

కొందరు బ్యాలెట్ పేపర్ల మీద రైట్ గుర్తుపెట్టగా.. ఇంకొందరు బ్యాలెట్ పేపర్లను తిరగేసి అంకెలు వేసేసి తమ అతి తెలివిన ప్రదర్శించడం కనిపించింది. ఫలితాల్లో ఒక్కో ఓటు కీలకమైన నేపథ్యంలో ఏకంగా వేలకు వేలు ఓట్లు చెల్లనివిగా తేలడం.. అందులోను‌ ఉమ్మడి ఆదిలాబాద్ ఓటర్లే చెల్లని‌ఓట్ల లిస్ట్ లో టాప్ లో ఉండటం తీవ్ర చర్చకు కారణమైంది. కచ్చితంగా ఎవరో ఒకరికి తొలి ప్రాధాన్యం (1 అంకె) వేసి మొదటి ప్రాధాన్యతను చాటుకోవాల్సి ఉండగా.. కొందరు మేధావులు ఒకటి నెంబర్ వేయకుండానే 2, 3 అంకెను రాసేసి ఓటును చెల్లుబాటు కాకుండా చేసుకున్నారు. అలా వేసిన ఓట్లు ఏకంగా 8 వేలకు పైగానే పడ్డాయి. మొదటి ప్రాధాన్యత 1 అంకెను ఇద్దరికి వేసిన ఘనులు కూడా మూడు వేలకు పైగానే తేలగా… టిక్ మార్క్ తో ఓ 500 ఓట్లను‌ చెత్తబుట్ట పాలు చేశారు చెల్లని ఓటరు. సొంత పెన్నులను వాడేసిన మేధావుల సంఖ్య‌కూడా మూడు వందలు దాటింది. మరోవైపు చాలామంది. అంకెల్ని వేసి.. పక్కన సంతకాలు పెట్టి, పేర్లు కూడా రాశారు. ఇంకొందరైతే కవితలు రాసేసి‌ తమ అతి మేధావి తనాన్ని నిరూపించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ఓట్లన్నీ తిరస్కరణకు గురవడంతో అభ్యర్థుల తలరాతే మారిపోయింది. ఓటర్లంతా పట్టభద్రులైనా… ఎలా ఓటేయాలనే తెలివి లేని తనం సుస్పష్టమైంది.

పట్టభద్రులే కాదు.. ఉపాద్యాయులు కూడా మేము సైతం అన్నట్టుగానే కనిపించారు. తమ బ్యాలెట్ పేపర్ లో కవితలు రాసేసి.. పిచ్చి‌పిచ్చి గీతలు గీసేసి ఓటేశారు. చివరికి హోరాహోరీ పోరులో చెల్లని ఓట్లలలోని నాలుగవ శాతం ఓట్లతో గెలుపు నిర్ణయం అయింది. అదే ఈ ఓట్లలలో కనీసం 50 శాతం ఓట్లు సరిగ్గా పడున్నా ఫలితం మరోలా ఉండేదేమో అన్న చర్చ జోరుగా సాగుతోంది. టిక్కులు పెట్టే.. గుండాలు చుట్టేసి.. పిచ్చి పిచ్చి‌గీతలు గీసేసి.. ప్రేమ కవితలు‌ రాసేసి మీ అతి మేధావి తనాన్ని చూపించిన మీ చేతుల్లోనా రేపటి భవిష్యత్ ను పెట్టేది అంటూ నిలదీస్తోంది సమాజం.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ