AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటే ఐడియా సర్ జీ..మట్టి ముంతల పైకప్పుతో ఏసీ చల్లదనం.. ఎండవేడి, కరెంట్‌ బిల్లుకు చెక్‌.. !

అక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పట్టణాలు, గ్రామాలు రాత్రిపూట కూడా చల్లబడవు. వేడిగాలుల భారాన్ని భరించాల్సి ఉంటుంది. వేసవి కాలం పాఠశాలలకు సెలవులు పొడిగించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో ఏసీలు విద్యుత్ బిల్లులు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే హిసార్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. 7వేల మట్టి ముంతలతో ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నాడు.

వాటే ఐడియా సర్ జీ..మట్టి ముంతల పైకప్పుతో ఏసీ చల్లదనం.. ఎండవేడి, కరెంట్‌ బిల్లుకు చెక్‌.. !
Clay Pot Roof Cools Homes
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2025 | 1:22 PM

Share

ఎండాకాలం ఆరంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగింది. అప్పుడు జనం కూలర్లు, ఏసీలను పరిగెత్తిస్తున్నారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో విద్యుత్తు వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. మరోవైపు మార్కెట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు గిరాకీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల దాకా వెళ్తుంటాయి. అలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు కరెంటు బిల్లును ఆదా చేసుకునేలా, నిండువేసవిలోనూ ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఓ యువకుడు చేసిన ఉపాయం ఎంతో ఆసక్తిగా ఉంది. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఏసీ లాంటి చల్లదనాన్ని నింపాడు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

హర్యానాలో వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది. మే, జూన్ నెలల్లో ఉత్తర రాష్ట్రంలో ఉష్ణోగ్రత సాధారణంగానే అత్యధికంగా 45-48°C వరకు పెరుగుతుంది. పట్టణాలు, గ్రామాలు రాత్రిపూట కూడా చల్లబడవు. వేడిగాలుల భారాన్ని భరించాల్సి ఉంటుంది. వేసవి కాలం పాఠశాలలకు సెలవులు పొడిగించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో ఏసీలు విద్యుత్ బిల్లులు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే హిసార్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. 7వేల మట్టి ముంతలతో ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నాడు.

హిసార్‌లోని సెక్టార్‌ 14లో నివాసముండే ఈ యువకుడు దిల్లీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీ చేశాడు. అధిక ఉష్ణోగ్రతలను అడ్డుకునేందుకు గోకుల్‌ ఈ కొత్త ఆలోచన చేశాడు. ఇంటి పైకప్పును బాగా శుభ్రం చేశాక, రసాయనాలతో వాటర్‌ ప్రూఫింగు చేయించాడు. దీనిపై 7,000 మట్టి ముంతలు బోర్లించి.. కాంక్రీటు, విరిగిన వృథా టైల్స్‌ సాయంతో ఖాళీలు భర్తీ చేశాడు. ఆ తర్వాత వైట్‌ సిమెంటు, వాటర్‌ ప్రూఫింగు ద్రావణంతో పైనుంచి ప్యాక్‌ చేశాడు. చివరగా 15 రోజులు వాటర్‌ ట్రీట్‌మెంటు ఇవ్వడంతో కూల్‌ పైకప్పు సిద్ధమైంది. దీంతో కరెంటు బిల్లు ఆదా అవుతుందని, చదరపు అడుగు నిర్మాణానికి  రూ.250 ఖర్చవుతుందని గోకుల్‌ వివరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..