AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol Consumers: మన దేశంలో మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట.. ప్రభుత్వ సర్వేలో వెల్లడి

మద్యం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, మద్యానికి దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. పలుచోట్ల హోర్డింగ్‌లు, భారీ అడ్వటైజ్‌మెంట్లు కూడా ఇస్తుంటారు. అయినప్పటికీ మద్యం తాగేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు. మద్యం అలవాటు కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినా కూడా చాలా మంది వివిధ కారణాల వల్ల తాగుబోతులుగా మారుతున్నారు. అంతేకాదు.. ఈ మద్యం అలవాటులో మహిళలకు కూడా టాప్‌ప్లేస్‌లో ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మహిళలు మద్యానికి బానిసలుగా మారారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Alcohol Consumers: మన దేశంలో మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట.. ప్రభుత్వ సర్వేలో వెల్లడి
Women Alcohol
Jyothi Gadda
| Edited By: TV9 Telugu|

Updated on: Mar 07, 2025 | 12:36 PM

Share

ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. తాగేవారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ప్రభుత్వాలు మద్యం ధరలను పెంచుతున్నా, మద్యం వినియోగం మాత్రం తగ్గేదేలేదంటూ పెరుగుతోంది. ఇప్పుడు దేశం మొత్తం మద్యంతో నిండిపోయింది. కానీ, బీహార్‌లో మాత్రం మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే, మద్యం అమ్మకాలు ప్రభుత్వాలకు మంచి ఆదాయ వనరుగా మారింది. మద్యం అమ్మకాల ద్వారానే ఆయా రాష్ట్రల ఖజానాకు భారీ మొత్తంలో డబ్బు విరాళంగా అందుతోంది. దీని అర్థం ప్రభుత్వాలు మద్యాన్ని నిషేధించడానికి ధైర్యం చేయవు.

ఈ మారుతున్న సంస్కృతి, పాశ్చాత్య పోకడల మధ్య మహిళలు కూడా ఇప్పుడు మద్యానికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఎక్కువగా ఐటీ ఉద్యోగులలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే భారతదేశంలో మహిళలు అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రంగా అస్సాం రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తాజా సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా సగటున 15-49శాతం మంది మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. 1.2 శాతం మంది మద్యం తాగుతారు. అస్సాంలో ఈ శాతం 16.5 కి దగ్గరగా ఉంది. అస్సాం తర్వాత, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో కూడా మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..