AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వికలాంగుడిగా నటించిన నకిలీ బిచ్చగాడు..రూ. 500లకు అడ్డంగా బుక్కయ్యాడు..!

ఎందుకంటే.. కారులో ఉన్న వ్యక్తి ఆ భిక్షాటన చేసుకుంటున్న వికలాంగుడికి ఇదే షరతు పెట్టాడు.. కర్రల సాయం లేకుండా రెండు కాళ్లపై పరిగెత్తాలని చెప్పాడు. ఇలా చేస్తే రూ.500ఇస్తానని చెప్పాడు. దాంతో డబ్బు ఆశతో ఆ వ్యక్తి వెంటనే యాక్టివ్‌ అయ్యాడు..తన ఊతకర్రలను పక్కన పెట్టి పరిగెత్తడం ప్రారంభించాడు. అది గమనించిన కారు డ్రైవర్‌.. అతన్ని నిలదీశాడు..ఇలా ఎందుకు అడుక్కుంటున్నావని అడుగగా, తానే కాదు, తన చెల్లి కూడా వికలాంగులమని నటిస్తూ ఇలాగే అడుక్కుంటున్నామని చెప్పాడు.

వికలాంగుడిగా నటించిన నకిలీ బిచ్చగాడు..రూ. 500లకు అడ్డంగా బుక్కయ్యాడు..!
Beggar Viral Video
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2025 | 10:41 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోలలో ప్రజలు నిజమైన సత్యాన్ని తెలుసుకుంటారు. అయితే కొన్ని వీడియోలు దిగ్భ్రాంతికరంగా ఉంటాయి. మీరు కూడలి వద్ద లేదా రెడ్ సిగ్నల్ వద్ద అడుక్కుంటున్న వ్యక్తులను చాలా మందిని చూసి ఉంటారు. భిక్షాటన చేసే వారిలో పిల్లలు, మహిళలు, వృద్ధులు, కొంతమంది వికలాంగులు కూడా ఉంటుంటారు. ఒక వ్యక్తి వికలాంగులలా నటిస్తూ భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు.

వైరల్ వీడియోలో ఒక బాలుడు కర్రల సహాయంతో కారు వద్దకు చేరుకుని కారు నడుపుతున్న వ్యక్తిని యాచించడం ప్రారంభించాడు. అతడి ధీనస్థితి చూసిన కారు నడిపే వ్యక్తి కరిగిపోయాడు.. వెంటనే రూ. 500 ఇవ్వడానికి అంగీకరించాడు. కానీ, అంతకు ముందు అతను ఒక షరతు పెట్టాడు. ఆ వ్యక్తి పరిస్థితి విన్న తర్వాత భిక్షాటన చేస్తున్న బాలుడు సిగ్గుపడ్డాడు.. కానీ కొంత సమయం తర్వాత అతను అంగీకరించాడు. వెంటనే అతడు రెండు కాళ్లతో పరిగెత్తడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే.. కారులో ఉన్న వ్యక్తి ఆ భిక్షాటన చేసుకుంటున్న వికలాంగుడికి ఇదే షరతు పెట్టాడు.. కర్రల సాయం లేకుండా రెండు కాళ్లపై పరిగెత్తాలని చెప్పాడు. ఇలా చేస్తే రూ.500ఇస్తానని చెప్పాడు. దాంతో డబ్బు ఆశతో ఆ వ్యక్తి వెంటనే యాక్టివ్‌ అయ్యాడు..తన ఊతకర్రలను పక్కన పెట్టి పరిగెత్తడం ప్రారంభించాడు. అది గమనించిన కారు డ్రైవర్‌.. అతన్ని నిలదీశాడు..ఇలా ఎందుకు అడుక్కుంటున్నావని అడుగగా, తానే కాదు, తన చెల్లి కూడా వికలాంగులమని నటిస్తూ ఇలా అడుక్కుంటున్నామని చెప్పాడు. అతడు చెప్పిన మాటలన్నీ విన్న ఆ కారు డ్రైవర్ ఆ అబ్బాయిని పనిలోకి తీసుకుంటానని చెప్పాడు. కానీ అతను అంగీకరించలేదు.

వీడియో ఇక్కడ చూడండి..

చివరికి కారు డ్రైవర్, నేను మీ సమయాన్ని వృధా చేసి ఉంటే మీకు డబ్బు ఇస్తాను కానీ 500 రూపాయలు ఇవ్వను అని అన్నాడు. ఇప్పుడు, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో, భిక్షాటన చేయమని ఎలా బలవంతం చేస్తున్నారో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇప్పుడు దానధర్మాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..