Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. ఎప్పట్నుంచి ప్రారంభం కానుందంటే?
ఈ మేరకు ఈ ఏడాది యాత్ర రెండు మార్గాలు అనంతనాగ్ జిల్లా పహల్‌గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లా బల్తల్ నుంచి ఒకేసారి ప్రారంభమవుతుందని చెప్పారు.. అది ఆగస్టు 9న రక్షా బంధన్ రోజున ఈ యాత్ర పూర్తవుతుందని వెల్లడించారు. ఈ మేరకు అమర్‌నాథ్యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

అమర్‌నాథ్ వెళ్లాలనుకుంటున్న భక్తులకు ఇది ముఖ్య గమనిక.. దక్షిణ కాశ్మీర్‌లో 3880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహ క్షేత్రం అమర్‌నాథ్‌కు 38 రోజుల వార్షిక యాత్ర జూలై 3న మొదలవుతుందని అధికార ప్రతినిధి ఒకరు బుధవారం ప్రకటించారు. అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఛైర్మన్ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షత వహించిన పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరాన్ని బట్టి బల్తల్, పహల్‌గామ్, నున్వాన్, పంథా చౌక్ శ్రీనగర్‌లలో సౌకర్యాలను మరింతగా పెంచేందుకు కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా వివరించారు.
ఈ మేరకు ఈ ఏడాది యాత్ర రెండు మార్గాలు అనంతనాగ్ జిల్లా పహల్‌గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లా బల్తల్ నుంచి ఒకేసారి జూలై 3న ప్రారంభమవుతుందని చెప్పారు.. అది ఆగస్టు 9న రక్షా బంధన్ రోజున పూర్తవుతుందని వెల్లడించారు. ఈ మేరకు అమర్‌నాథ్యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
కాగా, మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అమర్‌నాథ్ యాత్ర సందర్శనకు పెద్ద సంఖ్యలో భక్తులకు తరలి వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సులభంగా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులకు భద్రత, వైద్య సదుపాయాలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..