Delhi: కాపు కాసి ఓ వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల కనిపించినవి చూసి షాక్
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌పై వేట కొనసాగుతోంది. ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో 27కోట్ల డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. NCB, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ పెద్ద ఎత్తున డ్రగ్స్ బాగోతం బట్టబయలు అయింది. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో 27 కోట్ల విలువైన డ్రగ్స్ గుట్టురట్టు అయింది. ఐదుగురు సభ్యుల డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఛతర్‌పూర్ ఏరియాలో మెథాంఫెటమైన్ మార్పిడి జరగుతుందనే సమాచారంతో NCB, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. దానిలో భాగంగా.. కొందరు అనుమానితులపై నిఘా పెట్టడంతో గుట్టురట్టయింది. 10కోట్ల విలువైన 5కిలోల హై క్వాలిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్‌ను తీసుకెళ్తున్న వాహనం పట్టుబడింది. ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్ట్ చేయగా వారిలో నలుగురు ఆఫ్రికన్స్ ఉన్నారు. వీరిని నైజీరియన్ ఫ్యామిలీగా గుర్తించారు ఢిల్లీ పోలీసులు. పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం, టెక్నికల్ ఆధారాలతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో ఓ ఆఫ్రికన్ వ్యక్తి ఇంటిలో తనిఖీలు చేశారు. దాంతో.. కిచెన్ సుమారు 16 కోట్ల 40లక్షల విలువైన 1.1 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 4.1 కిలోల ఆఫ్ఘాన్ హెరాయిన్, టాబ్లెట్స్ రూపంలో ఉన్న 5.7 కిలోల MDMA పట్టుబడడంతో ఢిల్లీ పోలీసులు షాకయ్యారు. ఆ తర్వాత.. గ్రేటర్ నోయిడాలోని ఓ ఇంటిలోనూ సోదాలు చేయడంతో 389గ్రాముల హెరాయిన్, 26గ్రాముల కొకైన్‌ను స్వాధీనమైంది. అయితే.. ఆఫ్రికన్ పెడ్లర్ ఢిల్లీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. ఇక్కడి నుంచే అనేక ప్రాంతాలకు డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేల్చారు. ఇక.. డ్రగ్స్ గ్యాంగ్ గుట్టురట్టు చేసిన NCB, ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఢిల్లీలో డ్రగ్స్‌పై వేట కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ డ్రగ్స్ వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడానికి NCB, ఢిల్లీ పోలీసుల ఆపరేషనే నిదర్శనం అన్నారు అమిత్ షా.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి