Richest Indian Chef: దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్ ఇతనే నట.. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే..
చేసే చేతులను బట్టి వంటకాల రుచులు కూడా మారుతూ ఉంటాయిని చెప్పడం మీరు వినే ఉంటారు. అవును కొందరు చేసే వంటలు దానికి వాటి రుచినే మార్చేస్తాయి. అదే వారి చేతుల్లో ఉండే మ్యాజిక్.. ఈ మ్యాజిక్‌తోనే కొందరు కోట్లలో సంపాధిస్తున్నారు. అయితే మన దేశంలో అత్యంత సంప్పన్నుడైన చెఫ్ ఎవరో మీకు తెలుసా? అతని ఆస్తుల విలువ తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.

మన దేశ ప్రత్యేక వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినవి.. దేశ విదేశాలను నుంచి వచ్చిన పర్యాటకు ఇండియాలోని వంటకాలకు ఫిదా అయిపోతుంటారు. మన వంటకాల రుచులను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఎందరో చెఫ్‌లు కృషి చేశారు. దీంతో వారి వృత్తిలో ఎప్పికప్పుడూ కొత్త పుంతలను తొక్కుతూ వారు కోట్ల రూపాయలు సంపాదించారు. వీరి జాబితాలో వికాస్ ఖన్నా, కునాల్ కపూర్, రణవీర్ బ్రార్, హర్పాల్ సింగ్ సోఖి వంటి అనేక మంది చెఫ్‌లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత సంపన్నుడైన చెఫ్ విషయానికి వస్తే.. ఈ క్రెడిట్ మాత్రం కేవలం ఒకరికి మాత్రమే దక్కింది.
భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్ ఎవరు?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్ ఎవరనే విషాయిని వస్తే.. ఆయనే సంజీవ్ కపూర్.. ఆయన నికర విలువ దాదాపు రూ.1,165 కోట్లు. హోటల్ వంటగది నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం భారతీయ ఆహార చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయకమైన విజయగాథలలో ఒకటిగా నిలుస్తోంది. 1993లో తొలిసారి ఆయన టెలివిజన్ షో ఖానా ఖజానా ద్వారా భారతీయ ప్రజలకు తన వంటకాల తయారీని చూపించడం స్టార్ట్ చేశారు. దాదాపు 17 సంవత్సరాల పాటు నడిచిన ఈ షోను ఆయనకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆయన చెప్పే విధానం, స్పష్టమైన సూచనలు అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంట్లో వంటలు చేసే అడవారు ఆయన వంటలకు ఫ్యాన్స్ ఐపోయారు.

సంజీవ్ కపూర్ విజయం ప్రస్థానం ఈ టీవీషో దగ్గర ఆగలేదు. తన గుర్తింపును ఉపయోగించుకొని ఆయన ఓ బలమైన వ్యాపార సామ్రాజాన్ని స్థాపించారు. తనకు తెలిసిన వంటకాల గురించి సంవత్సరాలుగా, అతను 150 కి పైగా వంట పుస్తకాలను రాశాడు. వాటిని మార్కెట్‌లోకి తీసుకెళ్లాడు. దీంతో వాటికి ప్రజల నుంచి ఊహించని రెస్పాన్ వచ్చింది. ఆయన రాసిన బుక్స్‌లో చాలా వరకు బెస్ట్ సెల్లర్లుగా నిలిచాయి. ఇవే కాదు ఆయన సొంతగా కొన్ని రెస్టారెంట్‌లను సైతం స్థాపించాయి. ఇప్పుడు అవి ప్రపంచవ్యాప్తంగాను ప్రసిద్ది చెందాయి.
అయినా అతను వంటచేయడాన్ని మాత్రం ఆపలేదు. ఎన్నో ప్రపంచ వేదికలపై ఆయన తన ప్రతిభను కనబర్చాడు. వీటితో పాటు అగ్ర జాతీయ నాయకులు హాజరయ్యే అనేక అధికారిక వింధుల్లో కూడా ఆయన వంటలు చేశారు. ఇది ఆయన స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది.. ఇలా వంటగదిలో ప్రారంభించిన ఆయన ప్రయాణం ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టేసింది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
