AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్.. టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

తమ దేశాల చట్టాలను, నిబంధనలను అతిక్రమించారంటూ అమెరికాతోపాటు పలు దేశాలు భారతీయులను స్వదేశానికి పంపించేశాయి. ఇలా అమెరికా నుంచి పెద్ద ఎత్తున భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. అయితే, అమెరికాను మించి సౌదీ అరేబియా ఈ ఏడాదిలో ఎక్కువ మంది భారతీయులను బహిష్కరించడం గమనార్హం. మొత్తంగా 81 దేశాల నుంచి 24,600 మంది భారతీయులు వెనక్కి వచ్చారు.

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్.. టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
Indians Deportion
Rajashekher G
|

Updated on: Dec 27, 2025 | 4:53 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీసా నిబంధనలు కూడా కఠినతరం చేశారు. ఈ క్రమంలోనే అక్రమంగా ప్రవేశించారన్న కారణంతో అమెరికాలోని వేలాది మంది భారతీయులను ఆ దేశం నిర్ధాక్షిణ్యంగా మనదేశానికి పంపించింది. అయితే, మరో దేశం కూడా ఇదే బాటలో నడుస్తోంది. అదే సౌదీ అరేబియా.

2025లో 81 దేశాలు 24,600 మందికిపైగా భారతీయులను స్వదేశానికి పంపించాయని ఇటీవల పార్లమెంటులో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ జాబితాలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉందని తెలిపింది. సౌదీ అరేబియా ఈ సంవత్సరంలో 11,000 మంది భారతీయులను తిరిగి పంపించిందని వెల్లడించింది. ఈ సంఖ్య అమెరికా బహిష్కరించిన దానికంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది అమెరికా 3800 మంది భారతీయ ప్రైవేట్ ఉద్యోగులను ఇండియాకు తిరిగి పంపించింది. ఇది గత ఐదేళ్లలో అమెరికా నుంచి బహిష్కరించబడిన సంఖ్య కంటే ఎక్కువే.

ఏ దేశం నుంచి ఎంతమంది భారతీయులు వెనక్కి వచ్చారంటే?

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుంచి 3414 మందిని, హూస్టన్ నుంచి 234 మందిని తిరిగి భారతదేశానికి పంపించారు. ఇక ఇతర దేశాల విషయానికొస్తే మయన్మార్ 1591 మంది భారతీయులను, మలేషియా 1485, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1469, బహ్రెయిన్ 764, థాయ్‌లాండ్ 481, కాంబోడియా 305 మంది భారతీయులను వెనక్కి పంపించాయి.

విద్యార్థుల పరంగా చూస్తే యూకే నుంచి అత్యధికంగా 170, ఆస్ట్రేలియా నుంచి 114, రష్యా నుంచి 82, యూఎస్ నుంచి 45 మంది విద్యార్థులను భారత్‌కు పంపించారు.

భారతీయుల బహిష్కరణకు కారణాలివే

గల్ఫ్ దేశాల నుంచి భారతీయులను బహిష్కరించడానికి ప్రధాన కారణాల్లో ఒవర్‌స్టేయింగ్ వీసాలు, రెసిడెన్సీ పర్మిట్స్, లీగల్ పర్మిట్స్ లేకుండా పనిచేయడం, ఎంప్లాయర్స్ నుంచి పారిపోవడం, క్రిమినల్, కేసుల్లో నిందితులుగా ఉండటం లాంటివి ఉన్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. చాలా దేశాలు అక్రమంగా నివాసాముంటున్నారనే కారణంతో బహిష్కరిస్తున్నాయని.. కానీ, అందుకు తగిన సమాచారం ఇవ్వడం లేదని పేర్కొంది. జాతీయత ధృవీకరణ పత్రాల పరిశీలన సందర్భంలో చట్టబద్ధంగా విదేశాలకు వెళ్లిన భారతీయులకు అక్కడి మన రాయబార కార్యాలయాలు సహకరిస్తున్నాయని వెల్లడించింది. ఏదైనా సమస్య ఉందని రాయబార కార్యాలయాలకు మెయిల్ చేసినా, ఫోన్ చేసినా ఆయా దేశాల్లోని భారతీయులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. సైబర్ నేరాలను అరికట్టేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

తెలుగువారి బహిష్కరణకు కారణాలు

గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయుల్లో ఎక్కువ మంది నిర్మాణ రంగం, కేర్ గివింగ్, డొమెస్టిక్ రోల్స్‌లో స్థిరపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ భీమా రెడ్డి తెలిపారు. స్కిల్స్ తక్కువగా ఉండటం, ఏజెంట్ల మోసాలపై అవగాహన లేకపోవడం లాంటి అంశాలు ఈ దేశాలకు వెళ్లినవారి బహిష్కరణకు కారణమవుతున్నాయని వెల్లడించారు. ఎక్కువ జీతాలు ఇప్పిస్తామని మయన్మార్, కాంబోడియా లాంటి దేశాలకు తీసుకెళ్లిన ఏజెంట్లు.. వారిని సైబర్ క్రైమ్ లాంటి నేరాల్లో భాగస్వాములను చేయడంతో ఆయా దేశాలు బహిష్కరిస్తున్నాయని వివరించారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!