ముంబైలో బహిరంగ ప్రదేశంలో పావురాలకు గింజలు వేసినందుకు నితిన్ సేత్ అనే వ్యాపారికి కోర్టు రూ.5,000 జరిమానా విధించింది. పావురాలకు దాణా వేయడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయని, ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ కేసులో కోర్టు డిసెంబర్ 22న తీర్పునిచ్చింది.