చలికాలంలో ఆస్తమా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో శ్వాసలో ఇబ్బంది, అలసట పెరుగుతాయి. ఉదయాన్నే బయటకి వెళ్లకపోవడం, తల, చెవులు కప్పుకోవడం, చల్లని ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్ నివారించాలి. వైరల్ ఇన్ఫెక్షన్లు, పొగ, ధూళి నుండి దూరంగా ఉండాలి. గోరువెచ్చని నీరు తాగాలి.