పాపం పిల్లోడు.. థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే.. ఇలా వైరల్ అవుతున్నాడు
Noida Thar Accident: నోయిడాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలుడు అద్దెకు తీసుకున్న మహీంద్రా థార్ SUVతో నగర రోడ్లపై బీభత్సం సృష్టించాడు. రీల్స్ కోసం తీసుకెళ్లిన కారు నియంత్రణ తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా, అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడితో సహా అతని ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మహీంద్రా థార్ SUV కార్‌ను రెంట్‌కు తీసుకున్న ఢిల్లీకి చెందిన ఒక బాలుడు నగర రోడ్లపై బీభత్సం సృష్టించాడు. డ్రైవ్ చేస్తున్న సమయంలో కారు కంట్రోల్ కాకపోవడంతో అడ్డొచ్చిన వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడగా, పలు వాహనదాలు ధ్వంసం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. నోయిడాలోని సెక్టార్ 24లోని ESIC ఆసుపత్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మహింద్ర థార్ కారుకు యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉండడంతో.. దానితో రీల్స్ చేద్దామనుకున్న ఢిల్లీకి చెందిన ఒక బాలుడు.. తన ఫ్రెండ్స్‌తో కలిసి.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా స్థానికంగా ఉన్న కార్ రెంటల్ షోరూం దగ్గరకు వెళ్లి మహింద్రా థార్ ఎస్‌యూవీని రెంట్‌కు తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు ఆ కార్‌ను తీసుకొని బయల్దేరారు.
అయితే కార్ డ్రైవ్ చేస్తున్న బాలుడికి మార్గ మధ్యలో వాళ్ల కుటుంబ సభ్యులు కనిపించారు. దీంతో కంగారుపడిపోయిన బాలుడు డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డుపై అడ్డొచ్చిన అన్ని వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే కార్లోని ఇద్దరు బాలులకు మాత్రం పెద్దగా గాయాలు కాలేదు. దీంతో వారు అక్కడి నుంచి తప్పించుకునేందు ప్రయత్నించారు. కానీ స్థానికలు వారిని వెంబడించి పట్టుకున్నారు.
అనంతరం గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలురుని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. అలాగే వారు డ్రైవర్ చేసిన కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మైనర్‌లకు కార్ ఎలా రెంట్‌కు ఇస్తారు.. మొదట ఆ రెంటర్ కార్ వాళ్లపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో చూడండి..
उत्तर प्रदेश के ग्रेटर नोएडा के सेक्टर-49 में “उच्च न्यायालय” लिखी थार ने व्यक्ति को मारी टक्कर…#UttarPradesh #Noida #Thar #Accident #ViralVideo #Neicknews pic.twitter.com/DKOtMXvHbI
— Nedrick News (@nedricknews) December 26, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
