AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEO సార్.. మీరు చాలా గ్రేట్ సార్.. ! కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్న బాస్..

ఇప్పుడు చాలా కంపెనీల్లోనూ శాంటా క్లాజ్‌ గిప్ట్స్‌ కల్చర్‌ కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు ఒకరి ఒకరు బహుమతులు అందజేసుకునే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎవరు ఎవరికి ఎలాంటి గిఫ్ట్‌ ఇస్తారో ఎవరికీ తెలియదు..! ఇందులో భాగంగా ఈసారి తమకు ఏ బహుమతి వస్తుందో తెలుసుకోవాలని ఓ కంపెనీ ఉద్యోగులు కూడా క్రిస్మస్ నాడు శాంటా క్లాజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే వారికి తమ కంపెనీ వారికి కలలో కూడా ఊహించని బహుమతి ఇచ్చింది. 540 మంది ఉద్యోగులకు ఏకంగా రూ. 2,100 కోట్ల బోనస్ ఇచ్చింది.

CEO సార్.. మీరు చాలా గ్రేట్ సార్.. ! కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్న బాస్..
Fibrebond Ceo Graham Walker
Jyothi Gadda
|

Updated on: Dec 27, 2025 | 1:04 PM

Share

క్రిస్మస్‌ పండగ సందర్బంగా ఒక సూపర్‌ గేమ్‌ ఉంటుంది.. అది సీక్రెట్‌ గిఫ్ట్స్‌..క్రిస్మస్ నాడు శాంటా క్లాజ్ తనకు ఇష్టమైన పిల్లలందరికీ బహుమతులు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తాడు. అందుకే ఈ శాంటా అంటే పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఎంతో ఇష్టం. ఇప్పుడు చాలా కంపెనీల్లోనూ శాంటా క్లాజ్‌ గిప్ట్స్‌ కల్చర్‌ కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు ఒకరి ఒకరు బహుమతులు అందజేసుకునే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎవరు ఎవరికి ఎలాంటి గిఫ్ట్‌ ఇస్తారో ఎవరికీ తెలియదు..! ఇందులో భాగంగా ఈసారి తమకు ఏ బహుమతి వస్తుందో తెలుసుకోవాలని ఓ కంపెనీ ఉద్యోగులు కూడా క్రిస్మస్ నాడు శాంటా క్లాజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే వారికి తమ కంపెనీ వారికి కలలో కూడా ఊహించని బహుమతి ఇచ్చింది. 540 మంది ఉద్యోగులకు ఏకంగా రూ. 2,100 కోట్ల బోనస్ ఇచ్చింది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రజలు అతన్ని నిజ జీవిత శాంటా అని పిలుస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

కంపెనీ అమ్మేసి ఉద్యోగులకు బోనస్..

అమెరికాలోని లూసియానాకు చెందిన ఒక వ్యాపారవేత్త హృదయాన్ని కదిలించే పని చేసాడు. దాని వల్ల అతనికి సోషల్ మీడియాలో రియల్ లైఫ్ శాంటా అనే బిరుదు వచ్చింది. గ్రాహం వాకర్ తన ఫ్యామిలీ నడిపిస్తున్న తయారీ ఫైబర్‌బాండ్‌ను కంపెనీ అమ్మకానికి పెట్టారు. తన తండ్రి స్థాపించిన కంపెనీని ఇటీవల 1.7 బిలియన్ డాలర్లకు అమ్మేశారు. అయితే, కంపెనీ అమ్మేందుకు ముందే కొనుగోలుదారు అయిన ఈటన్ కంపెనీకి ఓ కండీషన్ పెట్టారు సీఈఓ గ్రాహమ్ వాకర్. కొనుగోలు డీల్‌లో 15 శాతం వాటా అంటే దాదాపు రూ. 2 వేల కోట్లను గత కొన్నేళ్లుగా ఈ కంపెనీలోనే పని చేస్తున్న 540 మంది ఉద్యోగుల కోసం కేటాయించాలని స్పష్టంగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

రూ.2,100 కోట్ల బోనస్:

నివేదికల ప్రకారం, కంపెనీ మొత్తం అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో 15శాతం. దాదాపు $240 మిలియన్లు అంటే సుమారు రూ.2,157 కోట్లు 540 మంది ఉద్యోగులకు షేర్‌ చేశారు. దీని అర్థం ప్రతి ఉద్యోగికి సగటున సుమారు $443,000 అంటే సుమారు 3.7 కోట్లు బోనస్ లభిస్తుంది. ఈ చెల్లింపు మొత్తం ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తారు. అయితే ఉద్యోగులు ఈ కాలం వరకు కంపెనీలోనే ఉండాల్సి ఉంటుంది.

ఇటువంటి ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం ఏమిటి..?:

ఉద్యోగుల నిజాయితీ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రాహం వాకర్ వివరించారు. కష్ట సమయాల్లో కూడా చాలా మంది ఉద్యోగులు కంపెనీతోనే ఉన్నారని, వారి విధేయతను గౌరవించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. జూన్‌లో బోనస్ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో చాలా మంది ఉద్యోగులు అనిశ్చితంగా ఉన్నారు. కొందరు మొదట్లో దీన్ని జోక్ అని భావించగా, మరికొందరు భావోద్వేగానికి గురై ఏడ్చారని చెప్పాడు.

ఉద్యోగుల జీవితాల్లో మార్పు:

చాలా మంది ఉద్యోగులు ఈ డబ్బును తమ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించారు. కొందరు గృహ రుణాలు చెల్లించారు. మరికొందరు అప్పులు తీర్చారు. మరికొందరు తమ పిల్లల చదువుల కోసం ఉపయోగించారు. 1995 నుండి కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి, తన సొంత బోటిక్ తెరవాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించారు. మరికొందరు ఆ డబ్బును ఇతర ముఖ్యమైన అవసరాలకు ఉపయోగించారు.

ఇలాంటి నిర్ణయం అతి ముఖ్యమైనది..?:

సాధారణంగా, ఒక కంపెనీని అమ్మేసినప్పుడు వాటాదారులు బోనస్‌లను అందుకుంటారు. కానీ ఈ సందర్భంలో ఉద్యోగులు కంపెనీలో వాటాలను కలిగి లేనప్పటికీ, ఈ ప్రయోజనాన్ని పొందారు. అందుకే కంపెనీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో నిజమైన నాయకత్వం, మానవత్వం కలిగిన వారిగా ప్రశంసలు పొందుతున్నారు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. చాలా మంది సదరు కంపెనీ ఓనర్‌ని అసలైన హీరోగా అభివర్ణిస్తున్నారు. ఇటువంటి చర్యలు మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతాయని అంటున్నారు. మరొకరు స్పందిస్తూ.. ఇది నిజమైన పెట్టుబడిదారీ విధానం.. తన ఉద్యోగులందరినీ ఒక కుటుంబంగా భావించే బాస్ అంటూ కొనియాడారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?