NCERT Jobs 2026: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే లైఫ్ సెటిలంతే!
NCERT Recruitment 2026 Notification for 173 Posts: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన NCERTలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్ ఏ, బి, సి నాన్ అకాడమిక్ ఉద్యోగాల భర్తీరికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ సంస్థలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్ ఏ, బి, సి నాన్ అకాడమిక్ ఉద్యోగాల భర్తీరికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 173 సూపరిటెండెంట్, ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, బిజినెస్ మేనేజర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, పెయింటర్, కార్పెంటర్, టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్-3, ఫిల్మ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, స్క్రిప్ట్ రైటర్, స్టోర్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 27 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టుల వివరాలు
- గ్రూప్-ఏ పోస్టుల సంఖ్య: 9
- గ్రూప్-బి పోస్టుల సంఖ్య: 26
- గ్రూప్-సి పోస్టుల సంఖ్య: 138
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- ఎస్సీ కేటగిరీలో ఖాళీలు: 14
- ఎస్టీ కేటగిరీలో ఖాళీలు: 18
- ఓబీసీ కేటగిరీలో ఖాళీలు: 44
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఖాళీలు: 11
- యూఆర్ కేటగిరీలో ఖాళీలు: 86
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మరికొన్ని పోస్టులకు ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లోనూ ఉత్తీర్ణత పొందినట్లు సర్టిఫికెట్లు ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత ఉద్యోగానుభవం కూడా ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి పోస్టును బట్టి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 16, 2026వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద గ్రూప్ ఏ పోస్టులకు రూ.1,500, గ్రూప్ బి పోస్టులకు రూ.1200, గ్రూప్ సి పోస్టులకు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. పోస్టులను బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు గ్రూప్ ఏ పోస్టులకు రూ.15,600 నుంచి రూ.39,100 వరకు, గ్రూప్ బి పోస్టులకు రూ.9,300 నుంచి రూ.34,800 వరకు, గ్రూప్ సి పోస్టులకు రూ.5,200 నుంచి రూ.20,200 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది వెబ్‌సైట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




