KVS-NVS 2025 Exam Date: కేవీఎస్-ఎన్‌వీఎస్‌లో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా..? కీలక అప్‌డేట్ జారీ
KVS NVS Exam City Intimation Slip 2025 Download: టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు జనవరిలో..

హైదరాబాద్, డిసెంబర్ 27: కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) ఇటీవల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు జనవరిలో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింయి. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను పొందుపరిచింది. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి తమకు పరీక్ష ఏ నగరంలో జరగనుందో, పరీక్ష కేంద్రం ఎక్కడ వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
కాగా కేవీఎస్-ఎన్‌వీఎస్ పరీక్షలు జనవరి 10, 11 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఇక అడ్మిట్ కార్డులు జనవరి మొదటి వారంలో విడుదలకానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. కాగా దేశవ్యాప్తంగా 15,762 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
కేవీఎస్-ఎన్‌వీఎస్ పరీక్షల సీటీ ఇంటిమేషన్ స్లిప్పుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీఎస్సీ బోర్డులో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు సవరణకు ఛాన్స్!
సీబీఎస్సీ బోర్డు ఇటీవల వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఎగ్జామినేషన్ 2026కు దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు ఉంటే మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు డిసెంబర్ 29, 30 తేదీల్లోతమ అప్లికేషన్‌లలో తప్పులను సరిచేసుకోవచ్చు. కాగా సీబీఎస్‌ఈ బోర్డు మొత్తం 124 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సీబీఎస్సీ బోర్డు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు సవరణకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




