AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో భారీ ఊరట.. ఆ సినిమా కేసులో విచారణకు స్టే

వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మకు..కాస్త ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి న‌మోదైన కేసులో విచార‌ణ‌పై హైకోర్ట్ స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది. గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ

ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో భారీ ఊరట.. ఆ సినిమా కేసులో విచారణకు స్టే
Ram Gopal Varma
K Sammaiah
|

Updated on: Mar 06, 2025 | 2:36 PM

Share

వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మకు..కాస్త ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి న‌మోదైన కేసులో విచార‌ణ‌పై హైకోర్ట్ స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది. గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు రామ్‌గోపాల్‌ వర్మ. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా తీశారంటూ వర్మపై గతంలో ఫిర్యాదులు అందాయి.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి తీయ‌డంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయ‌ని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆర్జీవీపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన సీఐడీ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వ‌డంతో పాటు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోరారు. అయితే సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిష‌న్‌కి సంబంధించి ఆర్జీవీ తరపు న్యాయవాదులు నేడు త‌మ వాదన వినిపించారు. 2019లో విడుదలైన సినిమాపై ఇన్నాళ్లకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాద‌న‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి? అని ప్ర‌శ్నించింది. అలాగే ఈ కేసుపై విచారణకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్జీవీపై సీఐడీ తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ