ఐపీఎల్ అరంగేట్రంలోనే అదుర్స్.. అదిరిపోయే రికార్డులో చేరిన భారత బౌలర్

ఐపీఎల్ అరంగేట్రంలోనే అదుర్స్.. అదిరిపోయే రికార్డులో చేరిన భారత బౌలర్

image

TV9 Telugu

01 April 2025

ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వనీ కుమార్ సోమవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు.

ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వనీ కుమార్ సోమవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు.

తన తొలి బంతికే అజింక్య రహానే వికెట్ తో అశ్వని బౌలింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లో రింకు సింగ్, మనీష్ పాండేలను వికెట్లతో పడగొట్టాడు.

తన తొలి బంతికే అజింక్య రహానే వికెట్ తో అశ్వని బౌలింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లో రింకు సింగ్, మనీష్ పాండేలను వికెట్లతో పడగొట్టాడు.

మూడో ఓవర్లో ఆండ్రీ రస్సెల్ ను పడగొట్టాడు. ఐపీఎల్ అరంగేట్రంలో మరే ఇతర భారత బౌలర్ ఇంత మెరుగైన స్పెల్లింగ్ నమోదు చేయలేదు.

మూడో ఓవర్లో ఆండ్రీ రస్సెల్ ను పడగొట్టాడు. ఐపీఎల్ అరంగేట్రంలో మరే ఇతర భారత బౌలర్ ఇంత మెరుగైన స్పెల్లింగ్ నమోదు చేయలేదు.

ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అత్యుత్తమ గణాంకాల రికార్డు అల్జారి జోసెఫ్ పేరిట ఉంది. 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున 12 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు.

రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ తరపున ఆండ్రూ టై 17 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టడం, ఒక బౌలర్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసుకున్న మరో రికార్డ్.

ఐపీఎల్ అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు.. అల్జారీ జోసెఫ్ (MI) - 6/12 vs SRH (2019), ఆండ్రూ టై (GL) - 5/17 vs RPS (2017)

షోయబ్ అక్తర్ (కెకెఆర్) - 4/11 vs ఢిల్లీ (2008), అశ్వనీ కుమార్ (MI) - 4/24 vs KKR (2024)

కెవాన్ కూపర్ (RR) - 4/26 vs KXIP (2012). అయితే, మొత్తంగా అశ్వని కుమార్ తొలి బంతికే వికెట్ తీసి, 10 వ బౌలర్‌గా నిలిచాడు.