ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడవ్వని భారత ఆటగాళ్లు వీరే?
TV9 Telugu
12 November 2024
నవంబర్ 24, 25 తేదీల్లో జెద్దా వేదికగా జరగనున్న ఐపీఎల్ మెగా వేలం కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
స్టార్ ప్లేయర్ల నుంచి యంగ్ ప్లేయర్ల వరకు వేలం కోసం ఎదురుచూస్తున్నారు. అత్యధిక ధర ఎవరికి దక్కుతుందో చూడాలి.
అయితే, వేలంలో అమ్ముడవ్వని కొంతమంది ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున పవర్ ఫుల్ రీఎంట్రీ చేసిన అజింక్య రహానే 2024లో విఫలమయ్యాడు. దీంతో 2025లో ఏ జట్టు కూడా ఆసక్తి చూపడం లేదు.
ఇషాంత్ శర్మ కూడా ఐపీఎల్ 2025లో అమ్ముడవ్వకపోవచ్చు. ఢిల్లీ తరపున 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. వయసే ఇషాంత్‌కు ఆటంకంగా మారింది.
గుజరాత్ టైటాన్స్ మాజీ ప్లేయర్ ఉమేష్ యాదవ్ కూడా ఈ ఏడాది ఖాళీగానే ఉండాల్సి రావొచ్చు. 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
టీమిండియా తరపున టెస్ట్‌ల్లో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఫ్రాంచైజీలను ఆకట్టుకోవడంలో వెనుకంజలో ఉన్నాడు.
మోహిత్ వర్మ 2023లో గుజరాత్ తరపున ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. 2024లో కేవలం 13 వికెట్లు పడగొట్టి, పేలవ ఫాంతో దూరమయ్యే ఛాన్స్ ఉంది.