ఆవ నూనెతో అద్భుత ప్రయోజనాలు.. ఆస్పత్రి నుంచి బ్యూటీ పార్లర్‌ వరకు.. అన్నీ మీ ఇంట్లో ఉన్నట్టే..!

దీన్ని ఉపయోగించి వంట చేయడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా చర్మ సమస్యలు, దానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆవనూనెతో వండటం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఆవ నూనెతో అద్భుత ప్రయోజనాలు.. ఆస్పత్రి నుంచి బ్యూటీ పార్లర్‌ వరకు.. అన్నీ మీ ఇంట్లో ఉన్నట్టే..!
Mustard Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 10, 2022 | 12:20 PM

దక్షిణ భారతదేశంలో నెయ్యి, కొబ్బరి నూనె ఎలాగో.. ఉత్తర భారతదేశంలో ఆవనూనె బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల హృదయ సంబంధ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. మస్టర్డ్ ఆయిల్‌లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ రెండూ కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అదే విధంగా, ఆవాల నూనెలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి వంట చేయడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా చర్మ సమస్యలు, దానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆవనూనెతో వండటం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఆవనూనెలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFA మరియు PUFA) ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. మస్టర్డ్ ఆయిల్‌లో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. ఆవనూనెలో వండిన ఆహారాలు దాని రుచిని పెంచుతాయని వివిధ పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. మస్టర్డ్ ఆయిల్ శరీర శ్రేయస్సు కోసం శక్తివంతమైన ఉద్దీపనగా పనిచేస్తుంది. ఆవనూనెతో వండిన ఆహారాన్ని తినడం వల్ల కాలేయం జీర్ణ రసాలు, పిత్తం ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు వేరే రంగులో కనిపించే మస్టర్డ్ ఆయిల్ వేడిచేసినప్పుడు బంగారు రంగులోకి మారుతుంది. దాని ద్వారా మనం దాని రుచిని అనుభవించవచ్చు.

ఆవాల నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది. చర్మం చిట్లడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరానికి ఆవాల నూనె రాసుకుంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆవనూనెలోని సెలీనియం మంట, నొప్పిని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. ఆవాల నూనె కూడా దగ్గు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి