మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే గనుక త్వరగా మార్చుకోండి.. లేదంటే, తప్పదు భారీ మూల్యం..!
ఎక్కువ నీరు తాగటం వలన అనేక తీవ్రమైన వ్యాధులు కూడా మొదలవుతాయి. కాబట్టి, ఎల్లప్పుడూ శరీర అవసరాన్ని బట్టి నీటిని త్రాగాలి. మంచి నిద్ర పొందేలా చూసుకోండి..
ప్రజలు ఇటీవల అనుసరిస్తున్న జీవనశైలి, అలవాట్లు తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తున్నాయి..ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు వ్యాయామాలు ఆశ్రయిస్తుంటే, మరికొందరు ఆహారం అలవాట్లను మార్చుకుంటున్నారు. కానీ కొన్ని పొరపాట్లు వారి కష్టార్జితాన్ని పాడుచేస్తున్నాయి. అయితే, మీకు కూడా ఈ అలవాట్లు ఉంటే గనుక త్వరగా మార్చుకోండి. లేదంటే ఆరోగ్యపరంగా తర్వాత మీరే పశ్చాత్తాపపడతారు.
తగినంత నీరు తాగాలి.. తగినంత నీటిని తాగటం ఆరోగ్యానికి మంచిది. కానీ, ఎక్కువ నీరు తాగటం వలన అనేక తీవ్రమైన వ్యాధులు కూడా మొదలవుతాయి. కాబట్టి, ఎల్లప్పుడూ శరీర అవసరాన్ని బట్టి నీటిని త్రాగాలి. మంచి నిద్ర పొందేలా చూసుకోండి.. నేటి బిజీ రొటీన్‌లో, ప్రజలు తగినంత నిద్ర పొందలేకపోతున్నారు. కొందరు వారి నిద్ర సమయాన్ని సర్ధుబాటు చేసుకుంటున్నారు. ఈ రెండూ పలు రకాల వ్యాధులకు మూలం. చాలా సార్లు సరైన సమయంలో తగినంత నిద్ర పొందడం ద్వారా, మనలోని అనేక సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి.
మధ్యపానం.. మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే, మద్యానికి దూరంగా ఉండండి. ఇది నేరుగా మన రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుంది. దాంతో మీ ఆరోగ్యం కూడా అత్యంత త్వరితగతిన క్షీణిస్తుంది.
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.. ఇంట్లో పెద్దలు ఎప్పుడూ చేతులు కడుక్కోవాలని సూచిస్తుంటారు. మన చేతుల్లోకి ఎన్నో బాక్టీరియాలు వచ్చి ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లి మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బ్యాక్టీరియాను నివారించాలి. దాంతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
అతిగా తినడం.. మీకు ఇష్టమైన ఆహారాలు ఉంటే, వాటిని అతిగా తినడం మానుకోండి. చాలా సార్లు, సినిమా చూస్తున్నప్పుడు కూడా, ఎక్కువ స్నాక్స్ లేదా ఆహారం తీసుకుంటారు. అతిగా తినడం ఎల్లప్పుడూ ఉదరకుహర వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడి వ్యాధులు పెరుగుతాయి.
ధూమపానం.. మద్యం సేవించినట్లే, ధూమపానం మన ఆరోగ్యానికి శత్రువు. ధూమపానం వల్ల ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఉన్నాయి. ఇది తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. దీని ప్రభావాలు ఆలస్యం.. కానీ, చాలా ప్రమాదకరమైనవి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి