Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి..!

కొన్నిసార్లు అధిక, మరియు ఫ్లూ వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఫ్లూ లక్షణాలు పదే పదే వేధిస్తున్నట్టయితే, శరీరమంతా బాధాకరంగా ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి.

Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి..!
Liver
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2022 | 8:46 AM

వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ కండిషన్ కాలేయ క్యాన్సర్‌కు దారిస్తుంది.. ఆల్కహాల్ తీసుకునే సమయంలో సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం. ఈ అలవాటు కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. స్థూలకాయం, అనువంశికంగా వచ్చే పొట్ట వంటి ఒబేసిటీ కాలేయ క్యాన్సర్‌కు ఒక కారణం. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్‌సీసీ తరహా క్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ. కాలేయ క్యాన్సర్‌ను ముందే కనుగొంటే మరణాన్ని తప్పించుకోడానికి ఉండే అవకాశాలు 80 శాతం కంటే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, కాలేయ క్యాన్సర్‌ విషయంలో తొలిదశలో చాలా మందిలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించవు. కడుపులో నొప్పి, బరువు తగ్గడం, కామెర్లు, పొట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు క్యాన్సర్ దశలో కనిపిస్తాయి. వివిధ రకాల పరీక్షల ద్వారా లివర్ క్యాన్సర్ దశను ముందుగానే తెలుసుకోవచ్చు.

కాలేయ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం కష్టం. సెకండ్‌ స్టేజ్‌లోనే కాలేయ క్యాన్సర్ లక్షణాలు బయటపడుతుంటాయి. అప్పుడు కూడా ఈ లక్షణాలు సాధారణ క్యాన్సర్ లక్షణాలను పోలి ఉంటాయి. ఇప్పటికే కాలేయ వ్యాధి ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, అలాంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి. కాలేయ క్యాన్సర్ లక్షణాలు సెకండ్‌ స్టేజ్‌లో ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, అనారోగ్యం,అలసట, ఉబ్బరంగా ఉంటుంది. కొన్నిసార్లు అధిక, మరియు ఫ్లూ వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఫ్లూ లక్షణాలు పదే పదే వేధిస్తున్నట్టయితే, శరీరమంతా బాధాకరంగా ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి.

మీరు కడుపులో ఏదైన కణతి మాదిరిగా ఉంటే..ఈ తీవ్రమైన లక్షణాల పట్ల శ్రద్ధ వహించండి. ఈ లక్షణాలను కలిగి ఉంటే మీకు క్యాన్సర్ ఉందని కాదు, కానీ అవగాహన కలిగి ఉండటం వలన వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీకు గతంలో సిర్రోసిస్ లేదా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉంటే ఈ వ్యాధులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లేదా మీరు ఎక్కువగా మద్యం సేవించే వారైతే, మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది