Watch Video: ఇదేమి అరాచకం.. హోటల్‌లో బిర్యానీ లేదంటే వెయిటర్‌ను కొట్టేస్తారా..

ముగ్గురు కస్టమర్లు సిబ్బందిని రెస్టారెంట్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి మరీ వారిపై దాడి చేశారు. దీంతో రెస్టారెంట్‌ ఓనర్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు

Watch Video: ఇదేమి అరాచకం.. హోటల్‌లో బిర్యానీ లేదంటే వెయిటర్‌ను కొట్టేస్తారా..
Biryani
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2022 | 12:00 PM

బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్లు ఓ రెస్టారెంట్ వర్కర్‌పై విరుచుకుపడ్డారు. రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన ముగ్గురు కస్టమర్లు చాలాసేపు వెయిట్ చేశారు. బిర్యానీ అర్డర్‌ ఆలస్యం అయిందనే కారణంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో..రెస్టారెంట్‌ ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గ్రేటర్ నోయిడాలోని అన్సల్ ప్లాజా మాల్‌లోని జూక్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో చూసిన నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆ రోజు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు జూక్ రెస్టారెంట్‌కి డిన్నర్‌ కోసం వచ్చారు. రాత్రి పొద్దుపోయాక చికెన్ బిర్యానీ అయిపోయింది లేదని రెస్టారెంట్ సిబ్బంది చెప్పినా..? వారు అలాగే ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎంతసేపటి బిర్యానీ రాకపోవటంతో..ఒక్కసారిగా ఒక వ్యక్తి పైకి లేచి సిబ్బందిని కొట్టడం ప్రారంభించాడు. ముగ్గురు కస్టమర్లు సిబ్బందిని రెస్టారెంట్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి మరీ వారిపై దాడి చేశారు. దీంతో రెస్టారెంట్‌ ఓనర్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు రవేశ్, మనోజ్, క్రిష్‌లను అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ముగ్గురు నిందితులు బుధవారం రాత్రి భోజనానికి రెస్టారెంట్‌కు వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ చేశారు. కానీ, అప్పటికే హోటల్‌లో బిర్యానీ అయిపోయిందని రెస్టారెంట్ సిబ్బంది అల్తాఫ్ తెలిపారు. దీంతో కస్టమర్ సహనం కోల్పోయి రెస్టారెంట్ సిబ్బంది కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లాడని నోయిడా ఏసీపీ మహేంద్ర దేవ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!