Rahul Gandhi: ఈయనకు 52 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా.. ఏం ఫిట్‌నెస్ బాస్.. టిప్స్ చెబుతారా..?

52 ఏళ్ల రాహుల్‌తో న‌డ‌క‌లో కాంగ్రెస్ పార్టీ యువ నేత‌లు సైతం పోటీ ప‌డ‌లేక‌పోతున్నారు. ఆయన ఫిట్ నెస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా టిప్స్ చెప్పండి బాస్ అని కొందరు కోరుతున్నారు.

Rahul Gandhi: ఈయనకు 52 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా.. ఏం ఫిట్‌నెస్ బాస్.. టిప్స్ చెబుతారా..?
Rahul Gandhi Fitness
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2022 | 12:39 PM

రాహుల్‌ ఫిట్‌నెస్‌ మంత్ర..! ఇప్పుడిదే దేశంలో హాట్‌ టాపిక్‌..! 52 ఏళ్ల రాహుల్‌ నడకతో.. 25 ఏళ్ల యువకులు సైతం పోటీ పడలేకపోతున్నారు. రాహుల్‌ గాంధీ ఫిట్‌నెస్‌… పార్టీ నేతలనే కాకుండా.. యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ రాహుల్‌ ఫిట్‌నెస్‌ మంత్ర ఏంటి?

-భారత్‌ జోడో యాత్రలో.. యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్న రాహుల్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌..

-రోజుకు సగటున.. 25-30 కి.మీ. అలుపు లేకుండా నకడ..

-చిన్న పిల్లలను..తన భుజాలపై ఎక్కించుకుని మరీ ఉత్సాహంగా యాత్ర..

-మధ్య మధ్యలో.. పుష్‌ అప్స్‌, రన్నింగ్ ఛాలెంజ్స్‌.

-10 సెకన్లలో.. 14 పుష్‌ అప్స్‌

-నడిసంద్రంలో మత్స్యకారులతో కలిసి…దాదాపు గంట సేపు జలకాలాటలు

-80 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ పైకిఏకబికిన ఎక్కిన రాహుల్‌..

-రాహుల్‌తో న‌డ‌క‌లో పోటీ పడలేకపోతున్న పార్టీ నేతలు..

రాహుల్ గాంధీ పాదయాత్ర జోరుగా హుషారుగా కొనసాగుతోంది. చిన్నా, పెద్దా, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతిఒక్కర్నీ కలుసుకొని ఉత్సాహం నింపుతున్నారు. యాత్ర ప్రారంభం అయ్యి రోజులు గడుస్తున్నా.. రాహుల్ మాత్రం ఎక్క‌డా వెన‌క్కు తగ్గ లేదు.. ఆరోగ్య సమస్యలతో ఢీలా పడలేదు. రోజురోజుకు.. రెట్టింపు ఉత్సాహంతో.. ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఎంత‌లా అంటే.. 52 ఏళ్ల రాహుల్‌ నడకతో.. 25 ఏళ్ల యువకులు సైతం పోటీ పడలేకపోతున్నారు. వృద్ధ నేత‌లు కొంద‌రు, మ‌రి కొంద‌రు స‌మ‌వ‌య‌స్కులే అయినా.. రాహుల్‌తో సమానంగా అడుగులు వెయ్యలేకపోతున్నారు. దీంతో.. 52 ఏళ్ల రాహుల్‌ గాంధీ ఫిట్‌నెస్‌… పార్టీనేతలనే కాకుండా.. యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

కేరళలో భారత్ జోడో యాత్ర సందర్భంగా.. రాహుల్‌గాంధీ.. నడిసంద్రంలో దాదాపు గంట సేపు సముద్రంలో స్విమ్మింగ్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. కొల్లాంలో మత్స్యకారుల చేపల వేట సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు.. పెద్ద సాహసమే చేశారు రాహుల్‌. పడవలో వెళ్లి మత్స్యకారులతో కలిసి.. చేపలు పట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హఠాత్తుగా పడవలోంచి సముద్రంలోకి దూకి.. జాలర్లతో పోటీగా.. గంట సేపు ఈత కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇక కర్నాటకలో తన యాత్రలో రాహుల్ గాంధీ పుష్-అప్స్ ఛాలెంజ్‌ను స్వీకరించడం వైరల్ గా మారింది. జోడో యాత్రలో ఓ బాలుడితో కలిసి పుష్-అప్‌లు చేయడం అందర్నీ ఆకట్టుకుంది. వెంటనే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో కలిసి ఆయనతో కలిసి కొన్ని పుష్-అప్‌లు చేశారు. రాహుల్ గాంధీ పుష్‌అప్‌లు చేస్తున్నప్పుడు ఇతరులను ఎంకరేజ్ చేశారు. కానీ.. రాహుల్‌తో మాత్రం నేతలు పోటీ పడలేకపోయారు. ఇప్పుడే కాదు రాహుల్ గతం నుంచి కూడా చాలా ఫిట్ గా ఉంటార‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో ఓ స్కూల్‌లో ఒక విద్యార్థి సవాల్‌ను స్వీకరించిన రాహుల్.. 14 పుష్‌ అప్స్‌ తీసి అప్స్‌ తీసి అందర్నీ ఆకట్టుకున్నారు.

ఇక కర్నాటకలో కొనసాగిన పాదయాత్రలో.. ఓ గ్రామంలో.. 80 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ పైకి.. రాహుల్‌ ఎకబికిన ఎక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జాతీయ జెండాను చేతపట్టి అక్కడి ప్రజలకు అభివాదం చేశారు.  ఇలా పాదయాత్రలో రాహుల్‌ గాంధీ తన ఫిటనెస్‌ను మరింతగా చాటుకుంటున్నారు. అయితే.. 52 ఏళ్లలో కూడా.. ఎలాంటి సమస్యలు లేకుండా… ఇంత ఉత్సాహంగా, ఉల్లాసంగా పాదయాత్ర చేస్తుండటంతో.. ఇప్పుడు రాహుల్‌ ఫిట్‌నెస్‌ మంత్ర.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో సైతం పిల్లలతో రన్నింగ్ రేస్‌లో ఉత్సాహంగా దూసుకెళ్లారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్‌ డైట్‌ను పక్కాగా ప్లాన్‌ చేసింది ఫుడ్ కమిటీ.. 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాహుల్‌… ఆయా రాష్ట్రాల్లో.. అక్కడ దొరికే ఆరోగ్యకరమైన భోజనాన్ని తన డైట్ మెనూలో భాగమయ్యేలా ప్లాన్ చేసింది ఫుడ్‌ కమిటీ. ఉదయం టీ, బిస్కెట్లతో.. రాహుల్ గాంధీ తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత గంట సేపు నడుస్తారు. పాదయాత్ర మొదలైన మూడు గంటల తర్వాత టిఫిన్ తీసుకుంటారు. టిఫిన్‌లో భాగంగా ప్రస్తుతం ఇడ్లీ, ఉప్మా, మసాల దోశ, వడలను డైలీ రొటీన్‌లో చేర్చింది ఫుడ్ కమిటీ. ఇక ప్రొటీన్స్ కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్‌లో డైట్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. మధ్యాహ్న భోజనంలో సీ ఫుడ్ తప్పనిసరి… చేపలతో పాటు ఏదైనా ఓ కూరగాయను కచ్చితంగా మెనూలో ఉండేలా చూస్తారు.

-సాయంత్రం పూట రాహుల్ తేలికపాటి ఆహారం లేదా పండ్లు

– రాత్రివేళ మితాహారాన్ని స్వీకరిస్తున్నారు. చపాతి, అందులో పన్నీర్ కూరకు ప్రాధాన్యత

-మధ్యాహ్నం వేళ డీ హైడ్రేట్ కాకుండా తరచూ పలు రకాల పళ్ల జ్యూస్‌లు

-నూనె ఎక్కువగా ఉండే వంటలు, అలసటకు గురి చేసే ఆహారానికి దూరం

తమిళనాడులో ఆరంభమైన రాహుల్‌ యాత్ర కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు వచ్చింది.. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మీదుగా జమ్మూకశ్మీర్‌ వరకు సాగుతుంది. శ్రీనగర్‌లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభతో.. 150 రోజుల తర్వాత తన యాత్రను ముగిస్తారు రాహుల్‌. మొత్తం 3570 కిలోమీటర్లు రాహుల్‌ గాంధీ కాలినడకన తిరగనున్నారు. అయితే…. తగ్గేదెలే.. అంటూ.. కొనసాగుతున్న రాహుల్‌ ఫిట్‌నెస్‌పై.. దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!