ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా..? అయితే, ఈ అద్భుతమైన చిట్కాలు పాటించండి.. సమస్యల నుండి గట్టెక్కుతారు….!

లక్ష్మి దేవి ఆశీస్సులతో మీరు సంపద, పురోగతిని పొందవచ్చు. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది సంపదల దేవత అయిన లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకునేలా చేస్తుంది.  భక్తులకు అమ్మవారి దీవెనలు అందుతాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా..? అయితే, ఈ అద్భుతమైన చిట్కాలు పాటించండి.. సమస్యల నుండి గట్టెక్కుతారు....!
Goddess Laxmi
Follow us

|

Updated on: Nov 11, 2022 | 1:31 PM

జ్యోతిశాస్త్రం, భక్తుల విశ్వాసం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. దీని ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఎల్లప్పుడూ సంపద, శ్రేయస్సు, ఆనందంతో నిండి ఉంటుంది. మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మీరు కోరుకుంటే, శుక్రవారాల్లో చేసే కొన్ని ప్రత్యేక పూజా విధానాలు ఇందుకు సహాయపడతాయి. మీరు మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే లేదా కష్టపడి పనిచేసినప్పటికీ పేదరికంతో జీవిస్తున్నట్లయితే, మీరు శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించి అనుగ్రహం పొందవచ్చు. లక్ష్మి దేవి ఆశీస్సులతో మీరు సంపద, పురోగతిని పొందవచ్చు. అయితే, జ్యోతిశాస్త్రం ప్రకారం..లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఏమి చేయాలి?

1. లక్ష్మీదేవికి తామర పువ్వు చాలా ప్రీతికరమైనది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఉదయం స్నానం చేసి అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ విగ్రహం ముందు శ్రీ సూక్తం చదవండి. పూజా సమయంలో తామరపూవు సమర్పించడం మర్చిపోవద్దు. శుక్రవారం నాడు గులాబీ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలని నిర్ధారించుకోండి.

2. శుక్రవారం నాడు ముగ్గురు పెళ్లికాని అమ్మాయిలను ఇంటికి పిలిచి, వారికి పాయసం ఇచ్చి, వారికి ఆకువక్క వాయినం ఇవ్వండి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

3. మీరు డబ్బు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే శుక్రవారం నల్ల చీమకు పంచదార ఇవ్వడం మంచిది. ఇది మీ పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇలా వరుసగా 11 శుక్రవారాలు చేయాలి.

4. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, శుక్రవారం నాడు ఏదైనా నైవేధ్యం సమర్పించండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పాలు, పాలతో చేసిన తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది సంపదల దేవత అయిన లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకునేలా చేస్తుంది.  భక్తులకు అమ్మవారి దీవెనలు అందుతాయి.

5. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తీపి పెరుగు తినండి. ఇలా చేస్తే మీ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి.

6. శుక్రవారం రాత్రి పూట అష్టలక్ష్మి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. రాత్రిపూట అష్టలక్ష్మిల ముందు అగరబత్తి వెలిగించి ఎర్ర గులాబీలను సమర్పించండి. అంతే కాకుండా అష్టలక్ష్మికి ఎర్రని పూల మాల కూడా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు మారుతాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం అంతా సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ధృవీకరణ ఆధారాలు లేవు.. దీని కోసం, మీరు నిపుణుల సలహా తీసుకోవాలి)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి