Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: బెడ్‌ రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ ఈ దిశలో ఉందా.? భారీ మూల్యం చెల్లిస్తారు జాగ్రత్త..

ఇంటి వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇంట్లో ఉండే వస్తువులు ఏ దిశలో ఉండాలన్న విషయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. గదుల్లో ఏర్పాటు చేసే వస్తువులు సరైన దిశలో ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా వాస్తుకు విరుద్ధంగా ఉంటే..

Vastu Tips: బెడ్‌ రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ ఈ దిశలో ఉందా.? భారీ మూల్యం చెల్లిస్తారు జాగ్రత్త..
Bed Room Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 11, 2022 | 8:17 PM

ఇంటి వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇంట్లో ఉండే వస్తువులు ఏ దిశలో ఉండాలన్న విషయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. గదుల్లో ఏర్పాటు చేసే వస్తువులు సరైన దిశలో ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా వాస్తుకు విరుద్ధంగా ఉంటే అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బెడ్‌ రూమ్‌లో ఉండే వస్తువులు ఇంట్లో ఉండే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు, బెడ్‌ రూమ్‌లో పాటించాల్సిన కొన్ని వాస్తు టిప్స్‌పై ఓ లుక్కేయండి..

బెడ్‌రూమ్‌లో ఉండే వాటిలో బీరువా ప్రధానమైంది. ఇలాంటి బరువైన వస్తువులను సాధారణంగా దక్షిణ, నైరుతి లేదా పశ్చిమ దిశలో ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతారు. వాయువ్య దిశలోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశలో కాకుండా మరే దిశలో బీరువాలను ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. ఇక బెడ్‌ రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రెస్సింగ్ టేబుల్‌కు ఉండే అద్దంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించే మంచం కనిపించకూడదు.

అంతేకాకుండా మంచంపై నిద్రిస్తున్న వారి ప్రతిబింబం అద్దంలో కనిపించకూడదు. ఒకవేళ ఇలా ఉంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు, అలాగే దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. చివరికి విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బెడ్‌ రూమ్‌లో ఏర్పాటు చేసుకునే అద్దం విషయంలో సూచనలు పాటించాలని చెబుతున్నారు. అలాగే బెడ్‌ రూమ్‌లో లేత రంగులను ఉపయోగించాలి. దీనివల్ల మానసిక ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం వాస్తు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇచ్చినవే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని రీడర్స్ గుర్తించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

పహల్గామ్ దాడికి ముందు కాశ్మీర్‌లో తెరకెక్కించిన సినిమాలు ఇవే..
పహల్గామ్ దాడికి ముందు కాశ్మీర్‌లో తెరకెక్కించిన సినిమాలు ఇవే..
వేసవిలో రోజు పెరుగన్నం తింటున్నారా.?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
వేసవిలో రోజు పెరుగన్నం తింటున్నారా.?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఫ్యూజుల్ ఔట్ అంతే.. పోకిరి పాప లేటెస్ట్ లుక్స్ చూశారా...
ఫ్యూజుల్ ఔట్ అంతే.. పోకిరి పాప లేటెస్ట్ లుక్స్ చూశారా...
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి
అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..
అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..
పనస పండు తిన్న తర్వాత మరిచిపోయి కూడా వీటిని తినకండి
పనస పండు తిన్న తర్వాత మరిచిపోయి కూడా వీటిని తినకండి
మార్కెట్‌లో ఆ ప్రధాన ఫోన్స్ మధ్యే పోటీ.. దిబెస్ట్ ఫోన్ ఏదంటే..?
మార్కెట్‌లో ఆ ప్రధాన ఫోన్స్ మధ్యే పోటీ.. దిబెస్ట్ ఫోన్ ఏదంటే..?
పహల్గామ్ టెర్రర్ అటాక్.. ట్రెండింగ్ లో ప్రభాస్ ఫౌజి హీరోయిన్
పహల్గామ్ టెర్రర్ అటాక్.. ట్రెండింగ్ లో ప్రభాస్ ఫౌజి హీరోయిన్
మునగ నీరు, లెమన్‌ గ్రాస్‌ వాటర్‌.. ఏది బెస్ట్‌ బ్యూటీ డ్రింక్‌ ?
మునగ నీరు, లెమన్‌ గ్రాస్‌ వాటర్‌.. ఏది బెస్ట్‌ బ్యూటీ డ్రింక్‌ ?
ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం.. ఉగ్రవాదులకు తగిన బుద్ది చెబుతాం!
ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం.. ఉగ్రవాదులకు తగిన బుద్ది చెబుతాం!