Horoscope Today: ఈరాశుల వారికి మానసిక ఆందోళ తగ్గుతుంది.. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది..శనివారం రాశి ఫలాలు..
ఈరోజు వీరికి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.
మేష రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
వృషభ రాశి.. ఈరోజు వీరు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది.
మిథున రాశి.. ఈరోజు వీరికి కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కళాత్మక వస్తువులను సేకరిస్తారు.ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు.
సింహ రాశి… ఈరోజు వీరికి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు.
కన్య రాశి.. ఈరోజు వీరికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
తుల రాశి.. ఈ రోజు వీరు కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది.
వృశ్చిక రాశి. ఈరోజు వీరు వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు.
మకర రాశి.. ఈరోజు వీరు నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
కుంభరాశి.. ఈరోజు వీరు ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీన రాశి.. ఈ రోజు వీరు గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.