AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Education Day: ఈ రోజే జాతీయ విద్యా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం..? దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంలో నవంబరు 11 ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ రోజునే ఎందుకు జరుపుకుంటారు..? దాని వెనుక ఉన్న విషయాలను తెలుసుకుందాం..రాండి!

National Education Day: ఈ రోజే జాతీయ విద్యా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం..? దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
National Educational Day
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 11, 2022 | 11:15 AM

Share

మన దేశంలో నవంబరు 11 ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజునే ఎందుకు జరుపుకుంటారు..? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఆలోచించకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..మన దేశ స్వాతంత్య్రం కోసం  ఎందరో సమరయోధులు బ్రిటీష్ పాలకులపై విరోచితంగా పోరాడారు. అలాంటి సమరయోధులలో మౌలనా అబుల్ కలాం అజాద్ కూడా ఒకరు. ఆయన కేవలం పోరాటమే కాక, స్వాతంత్య్రానంతరం మొట్టమొదటి కేంద్ర విద్యా శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారు. ఆయన ఆ పదవిలో చనిపోయేవరకూ.. దాదాపు 11 సంవత్సరాలు ఉన్నారు.  విద్యా శాఖ కోసం అజాద్ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఆయన జన్మదినాన్నే మనందరం నేడు జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ఇలా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు..

 భారత దేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008 లో అప్పటి మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈ శాఖనే విద్యా శాఖ అని పిలుస్తున్నాం. అప్పటినుంచి ప్రతి ఏటా నవంబరు 11న ఒక థీమ్ పెట్టుకుని మరీ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాలలో ఆయన చేసిన కృషిని, సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1992లోె దేశంలోనే అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను ప్రదానం చేసింది

విద్యా శాఖ కోసం ఆయన చేసిన కృషి..

ఆజాద్ తన పదవి కాలంలో బాలిక, గ్రామీణ విద్య కోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, 14 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలందరికీ నిర్భంద ఉచిత విద్య, వృత్తిపరమైన శిక్షణ వంటి వైవిధ్యభరితమైన విధానాలతో విద్యా శాఖ కోసం తన వంతు కృషి చేశారు. ఆయన నేతృత్వంలోనే అనేక విద్యాలయాలు నిర్మతమయ్యాయి. ఢిల్లీలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, 1951లో దేశంలోనే ప్రప్రథమంగా ఐఐటీ కారగ్పూర్‌, జామియా మిలియా ఇస్లామియా, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లను స్థాపించింది ఆయనే. అంతే కాక  ఢిల్లీ యూనివర్సిటీలో సాంకేతిక విభాగ ఫాకల్టీగా, ఐఐఎస్‌సీ బెంగళూరు అభివ‌ృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఇంతగా విద్యా శాఖ కోసం పాటు పడిన ఈ మహనీయుని స్మారకార్థంగా ప్రతి ఏటా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

ఈ సంవత్సరం విద్యా దినోత్సవం ఎజెండా

విద్యా శాఖ ప్రతి ఏటా ఒక ఎజెండాను లక్ష్యంగా పెట్టుకుని దాని సాధన కోసం కృషి చేస్తుంది. అలాగే ఈ ఏడాది నిర్ధేశించుకున్న ‘‘చేంజింగ్ ది కోర్స్ అండ్ ట్రాన్స్‌ఫరింగ్ ఎడ్యుకేషన్’’

మరిన్ని జాతీయ వార్తల కోసం.