Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దక్షిణాదిలో కూత పెట్టిన తొలి వందే భారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మైసూర్-చెన్నై రూట్‌లో ఐదో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. కర్నాటక పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలను ప్రారంభించారు.

PM Modi: దక్షిణాదిలో కూత పెట్టిన తొలి వందే భారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ..
PM Modi flags off Vande Bharat Express
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 11, 2022 | 12:18 PM

దక్షిణ భారతదేశానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మైసూర్-చెన్నై రూట్‌లో ఐదో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. కర్నాటక పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలను ప్రారంభించారు. మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలు దక్షిణ భారతదేశంలోనే మొదటిది. ఇది దేశంలో ఐదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, దక్షిణ భారతదేశంలో మొదటిది. దీనితో పాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. విధానసౌధ కాంప్లెక్స్‌లోని సాధుకవి కనక్ దాస్, మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ తన దక్షిణాది రాష్ట్రాల పర్యటనను ప్రారంభించారు. దీని తరువాత, ప్రధాని మోదీ క్రాంతివీర్ సంగోలి రాయన్న (కెఎస్‌ఆర్) రైల్వే స్టేషన్‌కు వెళ్లి మైసూర్-చెన్నై వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

ప్రధాని మోదీ ఉదయం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పలువురు మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బి. లు. యడ్యూరప్ప, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

చెన్నై-మైసూర్ మార్గంలో వందే భారత్ రైలు బుధవారం మినహా ప్రతి రోజు నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 16 కోచ్‌లో ఉంటాయి. అందులో 14 చైర్ కార్స్, 2 ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్స్ ఉంటాయి. ఏసీ చైర్ కార్‌లో చెన్నై నుంచి మైసూరుకు రూ.1200, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్‌కు రూ.2295 ఛార్జీ చెల్లించాలి. మైసూర్ నుంచి చెన్నైకి ఏసీ చైర్ కార్‌లో రూ.1365, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్‌ ప్రయాణానికి రూ.2485 ఛార్జీ చెల్లించాలి.

చెన్నై-మైసూర్ మార్గంలో వందే భారత్ రైలు షెడ్యూల్ ఇదే..

అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2ను ప్రారంభిస్తారు

ఆ తర్వాత బెంగళూరులోని దాదాపు రూ.5 వేల కోట్లతో నిర్మించిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని ప్రారంభోత్సవంతో విమానాశ్రయంలో ప్రయాణీకుల సామర్థ్యం ఏటా ఐదు-ఆరు కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఇది ఏటా 2.5 కోట్లు.

108 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు

ఇక్కడి నుంచి సమీపంలోని వేదిక వద్దకు చేరుకుని 108 అడుగుల ఎత్తైన నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరవుతారు. అనంతరం తమిళనాడులోని దిండిగల్‌కు వెళ్లనున్నారు. తమిళనాడులోని దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవానికి ప్రధాని హాజరవుతారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా నగరంలో, వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మొదటి రోజు బెంగళూరు చేరుకున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో పర్యటించనున్నారు. ప్రధాని తన పర్యటనలో రూ. 25000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పథకాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన ద్వారా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పునాదిని బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు