Snake Man: ఎంతటి పామునైనా పట్టుకోవడంలో అతను దిట్ట.. కానీ అన్ని రోజులు మనవికాదు కదా!
అతను దాదాపు 30 సంవత్సరాల నుంచి పాములను పట్టేవాడు. అదే క్రమంలో ఓ విష పామును పట్టుకుని బాగ్‌లో వేస్తుండగా అది అతన్ని కాటు వేసింది. అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా..

అతను దాదాపు 30 సంవత్సరాల నుంచి తన చుట్టు పక్కల కనిపించే పాములను పట్టి సురక్షిత ప్రాంతాలలో విడిచి పెట్టేవాడు. అదే క్రమంలో ఓ విష పామును పట్టుకుని బాగ్‌లో వేస్తుండగా అది అతన్ని కాటు వేసింది. విషసర్పం కావడంతో స్థానికులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన మోతీరామ్(60) పాములు పట్టడంలో దిట్ట. స్థానికుల ఇళ్లల్లో పాములు కనిపిస్తే వాటిని ఓ బాగులో పట్టి దగ్గరలోని అడవులలో, దట్టమైన పొదలలో సురక్షితంగా వదిలిపెట్టేవాడు. ఇలా దాదాపు 30 సంవత్సరాలుగా పాములను పడుతున్న మోతీరామ్‌ను స్థానికులంతా ‘స్నేక్ మ్యాన్’ అని పిలిచేవారు.
ఇదే క్రమంలో గురువారం బరేలీ రాజేంద్ర నగర్‌లోని ఇక ఇంట్లో తాచు పాము ఉందని తెలిసి దానిని పట్టడానికి వెళ్లాడు మోతీరామ్. ఆ విషసర్పాన్ని పట్టుకోవడంలో సఫలీకృతుడు అయ్యాడు. కానీ దానిని పాములు బాగులో పెడుతుండగా అతన్ని అది కాటు వేసింది. అది తాచుపాము కావడంతో స్థానికులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు తిరిగి జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తమ వంతు ప్రయత్నించినా అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇది సహజమైన మరణం కాకపోయినప్పటికిీ విషయం తెలుసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదు. కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు.
‘‘ఇప్పటి వరకూ ఆయన ఎన్నో వేల పాములు పట్టాడు. కానీ ఈ రోజు కలిసిరాకపోవడంతో ఇదే ఆయనకు చివరి రోజుగా మారింది. పాము కాటుతో ప్రాణాలు కోల్పోయారు’’ అంటూ మోతీరామ్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..