Maharashtra: రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్‌.. ఎట్టకేలకు బోనులో చిక్కిన మ్యాన్ఈటర్

గతనెల 16, 17, 28 తేదీలతో పాటు ఈ నెల 4న నలుగురిపై దాడి చేసి బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో పులిని బంధించాలనిస్థానికులు అటవీశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన కూడా నిర్వహించారు.

Maharashtra: రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్‌.. ఎట్టకేలకు బోనులో చిక్కిన మ్యాన్ఈటర్
Tiger
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2022 | 10:05 AM

మనిషి రక్తాన్ని రుచి మరిగి ఏకంగా నలుగురి ప్రాణాలు తీసిన పులిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపిన శ్యామ్‌ 2 అనే మ్యాన్‌ ఈటర్‌ ఎట్టకేలకు అధికారుల బోనులో చిక్కింది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ఉత్తర బ్రహ్మపురి అటవీక్షేత్రం పరిధిలో తిరుగుతోన్న రెండున్నరేళ్ల వయసు ఉన్న ఈ మగ పులి గత నెలరోజులుగా స్థానికులను తీవ్ర భాయందోళనలకు గురిచేస్తోంది. గతనెల 16, 17, 28 తేదీలతో పాటు ఈ నెల 4న నలుగురిపై దాడి చేసి బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో పులిని బంధించాలనిస్థానికులు అటవీశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన కూడా నిర్వహించారు. దీంతో  మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్‌ మునగంటివార్‌ ఆదేశాలతో గత నెలరోజులుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు అమర్చి పులి కదలికలు గమనించారు.

కాగా బుధవారం సాయిగాట గ్రామ పరిసరాల్లోని అడవుల్లో తాడోబా ఫారెస్ట్‌ వైధ్యాధికారి రవికాంత్‌ కొబ్రాగడే, సార్ప్‌ షూటర్‌ అజయ్‌మరాటేలు మాటువేసి అటుగా వచ్చిన పులిపై మత్తుమందు ప్రయోగించార. ఆపై దానిని బోనులో బంధించి శుక్రవారం చంద్రపూర్‌లోని ట్రాజెట్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌కు తరలించారు. పులి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని, అయితే మానవ రక్తానికి అలవాటు పడిన దీనిని కొద్దిరోజులు పార్కులో ఉంచుతామని సీఎఫ్‌ఓ దినేష్‌ మల్హోత్రా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం..