AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ori Devuda OTT: ఈరోజు అర్ధరాత్రి నుంచే ఓరి దేవుడా ఓటీటీ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న ఓరి దేవుడా అప్పుడే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తయారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈరోజు (నవంబర్‌11) అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి ఆహా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Ori Devuda OTT: ఈరోజు అర్ధరాత్రి నుంచే ఓరి దేవుడా ఓటీటీ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Ori Devuda
Basha Shek
|

Updated on: Nov 10, 2022 | 12:42 PM

Share

విశ్వక్‌సేన్ హీరోగా, విక్టరీ వెంక‌టేష్ అతిథి పాత్రలో న‌టించిన చిత్రం ఓరి దేవుడా. తమిళంలో విజ‌య‌వంత‌మైన ఓ మై కడవులే చిత్రానికి తెలుగు రీమేక్‌గా డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. ఈ సినిమాతో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ ఫాంటసీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను బాగా అలరించింది. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న ఓరి దేవుడా అప్పుడే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తయారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈరోజు (నవంబర్‌11) అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి ఆహా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి పాలకూర పప్పు, ఆలూ ఫ్రై ఇచ్చావ్‌. నాలాగే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లందరి కోసం చూడడానికి ఆహాలో ఓరి దేవుడా సినిమాను ఇచ్చావు’ అంటూ ఓరి దేవుడా ఓటీటీ రిలీజ్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఆహా.

కాగా చిన్ననాటి నుంచి స్నేహితులుగా పెరిగిన యువతీయువకుడు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి రావడం.. ఆ తర్వాత వారిద్దరి జీవితాల్లో ఎదురైన పరిస్థితులు.. దీంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిపోతారు. అదే సమయంలో వారిమధ్య ఓ అపరిచిత వ్యక్తి ఎంటర్ కావడంతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఓరి దేవుడా కథ. ఈ సినిమాను పీవీపీ సినిమా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఓరి దేవుడా సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఆహాలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..