Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey- Python: కోతిని అమాంతం చుట్టేసిన కొండ చిలువ.. మిగతా కోతులు ఏం చేశాయో తెలిశాయో మీరే చూడండి

ఓ కోతిని కొండచిలువ చుట్టేసి మింగడానికి ప్రయత్నించింది. అయితే ఇది చూసిన కోతుల గుంపు మొత్తం కొండచిలువ చుట్టూ చేరుతాయి. గట్టిగా అరుస్తూ కొండచిలువపై దాడి చేస్తాయి.

Monkey- Python: కోతిని అమాంతం చుట్టేసిన కొండ చిలువ.. మిగతా కోతులు ఏం చేశాయో తెలిశాయో మీరే చూడండి
Monkey, Python
Follow us
Basha Shek

|

Updated on: Nov 09, 2022 | 8:17 PM

కొండచిలువలను ఈ భూమ్మీదే చాలా ప్రమాదకరమైన జీవులుగా పరిగణిస్తారు. ఎలాంటి జీవులనైనా ఇవి అమాంతం చుట్టేసి మింగేస్తాయి. వీటినుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఈ క్రమంలో ఓ కోతిని కొండచిలువ చుట్టేసి మింగడానికి ప్రయత్నించింది. అయితే ఇది చూసిన కోతుల గుంపు మొత్తం కొండచిలువ చుట్టూ చేరుతాయి. గట్టిగా అరుస్తూ కొండచిలువపై దాడి చేస్తాయి. సహచర కోతిని విడిపించడానికి శతవిథాలా ప్రయత్నిస్తాయి. ఒకసారి కొండచిలువ ఎదురు తిరిగినా కోతులు మాత్రం అసలు వెనక్కు తగ్గవు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా చిలిపి పనులకు కేరాఫ్‌గా కోతులను భావిస్తారు. అయితే అవి ఐకమత్యంగా కూడా ఉంటాయి. తమ గుంపులోని ఓ కోతిని ఇతర జంతువు లేదా మనిషి దాడి చేస్తే.. అస్సలు ఊరుకోవు. గుంపుగా వచ్చి ఎదురు దాడి చేస్తాయి. ఈ వీడియోనే అందుకు నిదర్శనం.

మనుషుల్లో కూడా ఉంటే బాగుండు..

అలా ఈ వైరల్‌ వీడియోలో కూడా కోతుల దళం కొండచిలువ బారి నుంచి తమ స్నేహితుడిని రక్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. చివరకు కోతుల దాడిని తట్టుకోలేని కొండచిలువ చుట్టేసిన కోతిని వదిలి అక్కడ నుంచి పారిపోతుంది. అయితే దురదృష్టవశాత్తూ ఆ కోతి అప్పటికే చనిపోయి ఉంటుంది. థాయ్‌లాండ్‌లోని ప్రచువాబ్ ఖిరీ ఖాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబందించిన వీడియో ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతోంది. ఒక కోతి కోసం మిగతా కోతులు చేసిన పోరాడంపై జంతు ప్రేమికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూగజీవాల్లో ఉన్న ఈ ఐకమత్యం మనుషుల్లో కూడా ఉంటే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు. మరి కోతుల ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by WILDMA? (@wildmaofficial)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కైలాస యాత్రలోని ఈ ప్రదేశాలు నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు
కైలాస యాత్రలోని ఈ ప్రదేశాలు నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు
తీరికలేని జీవితాలు.. పిల్లలకు భారమవుతున్న కన్నవారు..
తీరికలేని జీవితాలు.. పిల్లలకు భారమవుతున్న కన్నవారు..
వికెట్ పడిందంటూ ఎగేసుకుంటూ వచ్చాడు.. కట్‌చేస్తే.. అంపైర్ దెబ్బకు
వికెట్ పడిందంటూ ఎగేసుకుంటూ వచ్చాడు.. కట్‌చేస్తే.. అంపైర్ దెబ్బకు
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..