Viral video: మనుషులం మనం వీటిని చూసి నేర్చుకోవాలి.. వైరల్ అవుతున్న కోతుల వీడియో
తాజాగా సోషల్ మీ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో కోతులు చేస్తున్న పని నెటిజన్లను తెగ నవ్విస్తుంది. కోతులు చేసే పనులు ఒకొక్కసారి నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని సార్లు భయపెడుతుంటాయి.
జంతువులకు సంబందించిన వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో కోతులు చేస్తున్న పని నెటిజన్లను తెగ నవ్విస్తుంది. కోతులు చేసే పనులు ఒకొక్కసారి నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని సార్లు భయపెడుతుంటాయి. మనం రిలాక్స్ అవ్వడానికి ఎక్కడెక్కడికో వెళ్తుంటాం .. కానీ కోతులకు అలా కాదు. అవి ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా కోతులు తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించాయి.
మాములుగా నీళ్లను చూస్తే పిల్లలు ఆగలేరు. వెంటనే ఆ నీటిలోకి దిగి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ వీడియోలో కోతులు కూడా అదే చేశాయి. ఒక కోతి ఫ్యామిలీ మొత్తం వెకేషన్ కు వచ్చినట్టు ఒక ఇంటికి వచ్చాయి. అక్కడ స్విమ్మింగ్ పూల్ కనబడగానే అందులో దూకడం మొదలు పెట్టాయి.
పిల్లల స్విమ్మింగ్ పూల్ చూడగానే దూకడం మొదలుపెట్టారు. చెప్పు కోతి. దీనికి ఎవరు చెప్పారు.? ఒకరిపై ఒకరు వరుసలో నిలబడి నీటిలోకి దూకారు. ఈ వీడియో చూసి చాలా మంది నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు. కోతులు కూడా సరదాగా గడుపుతున్నాయని, మనుషులమైన మనం డిప్రెషన్‌తో బాధపడుతున్నామని కొందరు అంటున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
Monkeys having fun.. ? pic.twitter.com/ejB3CcXAnI
— Buitengebieden (@buitengebieden) November 5, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి