Anu Emmanuel: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్.. ఏకంగా ఆ తమిళ్ స్టార్ హీరో సరసన బ్యూటీ గర్ల్..

నవంబర్ 4న విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. ఇక ఈ మూవీతో చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుకు సూపర్ బూస్ట్ ఇచ్చింది. తాజాగా లక్కీ ఛాన్స్ కొట్టేసింది అను.

Anu Emmanuel: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్.. ఏకంగా ఆ తమిళ్ స్టార్ హీరో సరసన బ్యూటీ గర్ల్..
Anu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2022 | 12:00 PM

చాలా కాలం తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అను ఇమ్మాన్యుయేల్. ఇందులో అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వంలో వహించారు. నవంబర్ 4న విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. ఇక ఈ మూవీతో చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుకు సూపర్ బూస్ట్ ఇచ్చింది. తాజాగా లక్కీ ఛాన్స్ కొట్టేసింది అను. తమిళ్ స్టార్ హీరో కార్తి సరసన జపాన్ చిత్రంలో నటించనుంది అను. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రాజు మురుగన్ దర్శకత్వంలో హీరో కార్తి 25వ ప్రతిష్టాత్మక చిత్రం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.

విలక్షణమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ వినోదాత్మక చిత్రాలు అందించడంలో హీరో కార్తి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 2022 వరుస విజయాలతో కార్తి కి బ్లాక్ బస్టర్ ఇయర్ గా నిలిచింది. వరుసగా మూడు సూపర్‌ హిట్‌ లను అందుకున్నారు. సగుని’, ‘కాష్మోరా’, ‘తీరన్ అధిగారమ్ ఒండ్రు’, ‘ఖైదీ’ , ‘సుల్తాన్’ వంటి 5 సూపర్‌హిట్ చిత్రాల తర్వాత హీరో కార్తి 6వ సారి ప్రతిష్టాత్మక చిత్రం ‘జపాన్’ కోసం డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ మరోసారి జతకలిశారు. వినోదంతో పాటు సామాజిక విలువలతో చిత్రాలు అందించే రాజు మురుగన్ ‘జపాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు- డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్, రాజు మురుగన్ కాంబినేషన్ లో వచ్చిన ‘జోకర్’ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కార్తి ‘జపాన్’ కోసం రాబోతుంది. కార్తికి ఇది 25వ సినిమా కావడం మరింత విశేషం.

ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ జోడి కడుతోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో ‘మంగళం శీను’ పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌ గా 25 ఏళ్ల అనుభవంతో పాటు ‘కోలి సోడా’, ‘కడుగు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న విజయ్ మిల్టన్ ‘జపాన్’ చిత్రంతో తొలిసారిగా నటిస్తున్నారు. బెస్ట్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ గా 2020 నేషనల్ అవార్డ్ గెలుచుకున్న జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. ‘జపాన్’ పూజా కార్యక్రమాలు మంగళవారం ఉదయం గ్రాండ్ గా జరిగాయి. ‘జపాన్’ అభిమానుల అంచనాలను మించేలా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే