Sudigali Sudheer: ఆ షోలోకి రీఎంట్రీ ఇచ్చిన సుధీర్.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..
సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రా కంపెనీకి కూడా రష్మీ ఒంటరిగానే హోస్ట్ గా వ్యవహరిస్తుంది. హైపర్ ఆది.. ఆటోరాం ప్రసాద్... మిగతా కంటెసెంట్స్
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీతో.. నటనతో యూత్‌కు దగ్గరయ్యాడు. ముఖ్యంగా రష్మీ.. సుధీర్ జోడికి అభిమానులు ఎక్కువే ఉన్నారు. వీరిద్దరి కలిసి స్టేజ్ పై కలిసి చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే ఈ జంటకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. జబర్ధస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి కంపెనీ షోతో యాంకర్‌గా మారారు సుధీర్. సక్సె్స్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షో నుంచి సుధీర్ అనుహ్యంగా తప్పుకున్నాడు. అటు జబర్ధస్త్ షోలో కూడా సుధీర్ కనిపించలేదు. కొన్ని నెలలుగా పలు ఛానల్స్‌లో యాంకర్‌గా అలరించారు. అయితే సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రా కంపెనీకి కూడా రష్మీ ఒంటరిగానే హోస్ట్ గా వ్యవహరిస్తుంది. హైపర్ ఆది.. ఆటోరాం ప్రసాద్… మిగతా కంటెసెంట్స్ తనకామెడితో అలరించగా.. ఇంద్రజ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఈషోలకి రీఎంట్రీ ఇచ్చేశాడు సుధీర్. దీంతో తోటి నటులు సంతోషంగా ఫీల్ అయ్యారు.
తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో సుధీర్ కనిపించాడు. రష్మీతో కలసి అందంగా డాన్స్ చేయడమే కాకుండా శ్రీ దేవి డ్రామా యాంకర్స్‌గా కలిసి సందడి చేసారు. అంతేకాకుండా ప్రోమో చివరివరకు ఆసక్తిగా సాగింది. సుధీర్.. రాం ప్రసాద్ కామెడీ హైలెట్ కాగా.. సుధీర్ పై సెటైర్స్ నవ్వులు పూయించాయి. మదర్స్.. డాటర్స్ అనే కాన్సెప్ట్ తో అమ్మలకు.. కూతుర్లకు పోటీలు జరిగాయి.
ఇక బుల్లితెర యాంకర్ భాను శ్రీ తన పాటతో అందరిని కన్నీరు పెట్టించింది. స్టేజ్ పై కూర్చున్న రష్మీ కన్నీళ్లు పెట్టుకోవడంతో..ఆమెను సుధీర్ ఓదార్చాడు. అనంతరం.. కమెడియన్ నూకరాజు కాంతార క్లైమాక్స్ రీక్రియేట్ చేశాడు. కాంతార పాత్రలో నూకరాజు నటన అద్భుతం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది.