AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vishal: ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేయనున్న హీరో విశాల్.. ఎవరో తెలుసా ?..

విశాల్.. తాను త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నాని తెలిపారు. ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే అందరికీ చేస్తానని అన్నారు.

Actor Vishal: ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేయనున్న హీరో విశాల్.. ఎవరో తెలుసా ?..
Vishal
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2022 | 6:54 AM

Share

తమిళ్ స్టార్ హీరో విశాల్‏కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా ఈ హీరో పెళ్లి విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నటి అభినయ శ్రీతో విశాల్ ఏడడుగులు వేయనున్నారని రూమర్స్ నెట్టింట వైరలయ్యాయి. దీంతో తన వివాహం పై వస్తున్న వార్తలకు కొట్టిపరేశారు అభినయ. తాను ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవాలు లేవని తేల్చీ చెప్పింది. తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు విశాల్. ఇటీవలే చైన్నెలో ఓ సేవా సంస్థ ఆధ్వర్యంలో పదకొండు మంది పేద జంటలకు పెళ్లి జరిపించిన ఆయన.. వారికి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశాల్.. తాను త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నాని తెలిపారు. ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే అందరికీ చేస్తానని అన్నారు.

విశాల్ మాట్లాడుతూ.. ” నేను ప్రేమ వివాహమే చేసుకోవాలనుకుంటున్నాను. అరెంజ్డ్ మ్యారేజ్ నాకు సూట్ కాదనిపిస్తుంది. నేను ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తాను. ఆ అమ్మాయిని అతి త్వరలోనే మీకు పరిచయం చేస్తాను. ” అంటూ చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‏కు చెందిన అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది నెలలకే వీరి తమ వివాహన్ని రద్దు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం విశాల్ యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతున్నామని.. మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఈ భవన నిర్మాణం పూర్తైన వెంటనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో విశాల్ ప్రేమించిన అమ్మాయి ఎవరా ? అంటూ నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు అభిమానులు.

Follow Us
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?
ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?