Rashmi Gautham: సుధీర్‏తో స్నేహమా?.. ప్రేమా ? షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ..

తాజాగా మరోసారి సుధీర్‏తో ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ. ప్రస్తుతం ఆమె యంగ్ హీరో నందు సరసన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు

Rashmi Gautham: సుధీర్‏తో స్నేహమా?.. ప్రేమా ? షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ..
Rashmi Gautham
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 7:52 AM

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రష్మీ గౌతమ్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగువారికి మరింత చేరువైంది. అయితే కమెడియన్ సుడిగాలి సుధీర్‏తో ప్రేమలో ఉందనే వార్తలు ఎన్నో రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో వీరిద్దరు సైతం తమ గురించి వస్తున్న రూమర్స్ పట్ల అనేకసార్లు వివరణ ఇచ్చుకున్నారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని.. ప్రేమ లేదంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరోసారి సుధీర్‏తో ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ. ప్రస్తుతం ఆమె యంగ్ హీరో నందు సరసన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు మళ్లీ సుధీర్‏కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

సుధీర్, రష్మీకి మధ్య ఉంది స్నేహమా ?.. ప్రేమా ?.. పెళ్లి ? .. అని అడగ్గా.. రష్మీ స్పందిస్తూ.. నా గురించి అందరికీ వివరిస్తుంటే అసలు అది నా జీవితమే కాదు. అన్ని విషయాల్ని చెప్పాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగతం అని అన్నారు. “అలాగే సుధీర్‏కు నాకు మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటాను. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటామో.. అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు. ఓ మ్యాజిక్ లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్శించింది” అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక రష్మీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఇందులో ప్రేమా.. పెళ్లి గురించి రష్మీ సరైనా క్లారిటీ ఇవ్వకపోవడంపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ అంటూ వెండితెరపై.. ఇటు బుల్లితెరపై అలరిస్తున్నాడు. త్వరలోనే గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.