Samantha: డాక్టర్‍ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు.. మాకు సమంత ఆరోగ్యం గురించి తెలిసింది అప్పుడే.. యశోద నిర్మాత ఆసక్తికర కామెంట్స్..

'ఆదిత్య 369' వంటి గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో 'యశోద' తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది.

Samantha: డాక్టర్‍ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు.. మాకు సమంత ఆరోగ్యం గురించి తెలిసింది అప్పుడే.. యశోద నిర్మాత ఆసక్తికర కామెంట్స్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2022 | 7:49 AM

టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా చిత్రం యశోద. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నిర్మాతగా ఆయనది 40 ఏళ్ళ అనుభవం. స్ట్రెయిట్ తెలుగు, డబ్బింగ్ కలిపి 45కు పైగా సినిమాలు చేశారు. ‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో ‘యశోద’ తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లలో భాగంగా యశోద సినిమాతోపాటు సమంత ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

” యశోద సినిమాను అన్ని భాషల్లో చేయడానికి తగ్గ కథానాయిక ఎవరని చూస్తే సమంత గారు అయితే బావుంటుందని అనిపించింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఆవిడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమంత చేస్తారా? లేదా? అసలు కథ వింటారా? అంటే ఆమె మేనేజర్, నిర్మాత మహేంద్ర తప్పకుండా వింటారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 8న సమంత కథ విన్నారు. వెంటనే చేస్తానని చెప్పారు. అన్ని భాషల్లో చేద్దామని చెబితే ఆవిడ ఓకే అన్నారు. సమంత తర్వాత మరో కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ తీసుకున్నాం. కథ డిమాండ్ చేయడంతో ఒక్కో పాత్రకు ఒక్కొక్కరిని ఎంపిక చేసుకున్నామని” తెలిపారు శివలెంక ప్రసాద్.

ఇవి కూడా చదవండి

అలాగే.. సమంత ఆరోగ్యంపై స్పందిస్తూ.. ” సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పించవచ్చని అన్నాను. తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసని ఆవిడే చెప్పారు. హిందీలో చిన్మయి చెప్పారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందు మాకు తెలిసింది. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు