KGF Star Yash: కేజీఎఫ్ 3 పై క్లారిటీ ఇచ్చిన యశ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాకింగ్ హీరో..

ప్రస్తుతం డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు యశ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్‏మెంట్ రాలేదు. ఇక మరోవైపు కేజీఎఫ్ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ 3

KGF Star Yash: కేజీఎఫ్ 3 పై క్లారిటీ ఇచ్చిన యశ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాకింగ్ హీరో..
Kgf 3
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2022 | 8:59 AM

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ రికార్డ్స్ కొల్లగొట్టింది. పాన్ ఇండియా లెవల్లో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్‎లో చాప్టర్ గురించి హింట్ ఇవ్వడంతో ఈ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటి ఏర్పడింది. ఈ మూవీతో యశ్, ప్రశాంత్ నీల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ప్రస్తుతం డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు యశ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్‏మెంట్ రాలేదు. ఇక మరోవైపు కేజీఎఫ్ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ 3 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో యశ్.

శనివారం ముంబైలో జరిగిన ఇండియా టూడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ పై స్పందించారు యశ్. ” కేజీఎఫ్ సిరీస్‏లోని రెండు సినిమాలను ఆడియన్స్ ఎంతో ఆదరించి మా అందరినీ సక్సెస్ చేశారు. కేజీఎఫ్ 3 త్వరలోనే రాబోతుందని నేను భావించడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలలో నిజం లేదు. వాటిని ప్రేక్షకులు నమ్మకూడదు. ఈ సినిమా గురించి ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి త్వరలోనే అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత 6, 7 సంవత్సరాలుగా కేజీఎఫ్ చిత్రాలు చేస్తున్నాను..ఇక కేజీఎఫ్ 3 చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నాను. అలాగే పరిశ్రమలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నారు.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై