AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun-Vishwak Sen: అర్జున్ ఆరోపణలపై విశ్వక్ నుంచి రెస్పాన్స్.. సెట్‌లో అస్సలు గౌరవం ఇవ్వలేదంటూ

అప్‌కమింగ్‌ హీర్‌ విశ్వక్‌సేన్‌ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతున్నాడా? పెద్ద హీరోలను మించిన స్టార్‌డమ్‌ ఫీలవుతున్నాడా? విశ్వక్‌పై సీనియర్‌ నటుడు అర్జున్‌ ఆరోపణలు వింటే అది నిజమే అనిపిస్తుంది. అసలు అర్జున్‌- విశ్వక్‌సేన్‌ మధ్య వివాదమేంటి?

Arjun-Vishwak Sen: అర్జున్ ఆరోపణలపై విశ్వక్ నుంచి రెస్పాన్స్.. సెట్‌లో అస్సలు గౌరవం ఇవ్వలేదంటూ
Actor Arjun- Actor Vishwak Sen
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2022 | 8:37 AM

Share

విశ్వక్‌సేన్‌.. ఓ వర్ధమాన నటుడు. అతికొద్ది సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో కాస్త పేరుసంపాదించాడు. కేరీర్‌లో ఎదుగుతున్న దశలోనే వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నట్లు ఆయనపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. విశ్వక్‌ వ్యవహారశైలిపై సీనియర్‌ నటుడు అర్జున్‌ ఆరోపణలు అందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి.  అర్జున్‌ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఆయన నిర్మాణ సారథ్యంలో ఓ సినిమాకు విశ్వక్‌సేన్‌ సైన్‌ చేశారు. మూడునెలల క్రితం సినిమా షూటింగ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు అర్జున్. సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన పవన్‌కల్యాణ్‌ క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు. మూవీ ఓపెనింగ్‌కు ప్రముఖ దర్శకుడు రాఘవేందర్‌రావు, సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌, మా ప్రెసిడెంట్‌ మంచు విష్ణు సైతం హాజరై సినిమా సక్సెస్‌ కావాలని దీవించారు. అనంతరం రెండు, మూడు షెడ్యూల్స్‌ చిత్రీకరణకూడా పూర్తయింది.

అంతా స్మూత్‌గా సాగుతున్న సమయంలో సడన్‌గా ఏం జరిగిందో ఏమో తెలియదుగాని.. విశ్వక్‌సేన్‌ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన అర్జున్‌.. విశ్వక్‌కు వందలసార్లు కాల్‌ చేశారు. షూటింగ్‌కు రావాలని రిక్వెస్ట్‌ చేశారు. అయినా విశ్వక్‌.. షూటింగ్‌కు రాకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. స్టోరీ, రెమ్యునరేషన్‌పై అగ్రిమెంట్‌ చేశాక చివరి నిమిషంలో షూటింగ్‌కు రానంటూ సడెన్‌గా మెసేజ్‌ పెట్టడంపై ఆవేదన చెందారు. ఇంత అన్ ప్రొఫెషనలిజామా అంటూ ఫైరయ్యారు. అనూప్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్,  చంద్రబోస్ సాహిత్యం విషయంలో విశ్వక్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. విశ్వక్‌ కారణంగా జగపతిబాబు లాంటి సీనియర్ల డేట్స్‌ కూడా వేస్ట్‌ అయినట్లు చెప్పారు. ఇలాంటి నటుడిని తన 40ఏళ్ల కేరీర్‌లో చూడలేదన్నారు. సినిమా షూటింగ్‌ మరికొద్దిరోజుల్లో పూర్తవుతుందనగా.. విశ్వక్‌ జలక్‌తో షాకయ్యారు అర్జున్‌. ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నారు. విశ్వక్‌ వల్ల తాను, తన చిత్రయూనిట్‌ పడిన ఇబ్బందులపై ఇప్పటికే సినీపెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్‌ చాంబర్‌లోనూ కంప్లైంట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా అర్జున్‌- విశ్వక్‌ సినిమా వివాదంలో మరిన్ని ట్విస్టులు ఖాయంగా కనిపిస్తోంది.

“చిన్న సూచనలు కూడా పరిగణలోకి తీసుకోలేదు”

అర్జున్ ఆరోపణలపై విశ్వక్ సేన్ స్టాఫ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. డైలాగ్స్, సాంగ్స్, మ్యూజిక్‌ విషయంలో విశ్వక్ సజీషన్స్ ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. చిన్న, చిన్న మార్పులు చెప్పినప్పటికీ, అర్జున్ అంగీకరించలేదన్నారు. విశ్వక్ మాటకు సెట్‌లో కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. మనసుకు నచ్చని పని చేయలేక, బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. రెమ్యునరేషన్‌ సహా ఇతర అగ్రిమెంట్ వివరాలను విశ్వక్‌ నిర్మాతల మండలికి పంపినట్లు వివరించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.