Bigg Boss 6: గుండె పగిలేలా ఏడ్చిన గీతూ రాయల్.. బిగ్‏బాస్ వదిలి నేను పోను అంటూ ఎమోషనల్..వెక్కి వెక్కి ఏడ్చిన రేవంత్..

బిగ్‏బాస్ విన్నర్ కావాలనుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఆటను తన స్టైల్లో ఆడింది. బుద్ది బలం.. బుద్ది బలం.. నా గేమ్ ప్లాన్ అంటూ చివరికి మధ్యలోనే డ్రాప్ అయ్యింది.

Bigg Boss 6: గుండె పగిలేలా ఏడ్చిన గీతూ రాయల్.. బిగ్‏బాస్ వదిలి నేను పోను అంటూ ఎమోషనల్..వెక్కి వెక్కి ఏడ్చిన రేవంత్..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2022 | 7:48 AM

ఆటలోకి వస్తే అమ్మ.. నాన్న అని కూడా చూడని.. గెలవడానికే ప్రయత్నిస్తాను అంటూ ముందు నుంచి చెప్పింది. ప్రతి క్షణంపై గేమ్ పైనే ఫోకస్ పెట్టింది. బిగ్‏బాస్ విన్నర్ కావాలనుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఆటను తన స్టైల్లో ఆడింది. బుద్ది బలం.. బుద్ది బలం.. నా గేమ్ ప్లాన్ అంటూ చివరికి మధ్యలోనే డ్రాప్ అయ్యింది. బిగ్‏బాస్ విన్నర్ కావాలని ప్రతి క్షణం కలవరించి.. ప్రతి అమ్మాయికి ఆదర్శంగా ఎన్నో కలలు కన్న గీతూ రాయల్.. చివరకు తొమ్మిది వారాలకే బయటకు వచ్చేసింది. ఇక తన ఎలిమినేషన్ అస్సలు ఊహించలేకపోయిన గీతూ.. గుండె పగిలేలా ఏడ్చింది. నేను పోను.. బిగ్‏బాస్ వదిలి వెళ్లను అంటూ స్టేజ్ పైనే కూర్చుండి పోయింది. ఇక ఆమెను ఓదార్చడం నాగార్జున వల్ల కూడా కాలేదు. ఆదివారం ఎపిసోడ్‏లో హౌస్ మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. స్ట్రాంగ్ కంటెండర్ అయిన గీతూ ఎలిమినేషన్‏తో రేవంత్.. ఆదిరెడ్డి.. ఫైమా వెక్కి వెక్కి ఏడ్చారు.

ఒక్కొక్కరిని హోస్ట్ నాగార్జున సేవ్ చేస్తూ రాగా.. చివరగా గీతూ, శ్రీ సత్య మిగిలారు. దీంతో తాను కచ్చితంగా ఎలిమినేట్ అవుతానంటూ భావోద్వాగానికి గురయ్యింది శ్రీసత్య. కానీ అనుహ్యంగా గీతూ రాయల్ ఎలిమినేటెడ్ అని చెప్పేశాడు నాగ్. దీంతో ఆమె ఆ మాటలు వినలేక చెవులు మూసుకుంది. నెక్ట్స్ వీక్ కెప్టెన్ అవుదామనుకుంటే పంపించేస్తున్నారేంటీ బిగ్‏బాస్ అని ఏడ్చేసింది. నేను బాధపెట్టి ఐయామ్ సారీ..అంటూ తనకు నచ్చిన స్థలాల్లో కుర్చొని బాధపడింది. ఐ లవ్ యూ బిగ్‏బాస్.. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను నాకు పోవాలని లేదంటూ బోరుమని ఏడ్చింది. ఇక గీతూ ఎలిమిషన్ అస్సలు ఊహించని ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్, శ్రీసత్య ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ప్రతి నిమిషం ప్రత్యర్థుల్లా ఉండే రేవంత్… గీతూ ఎలిమినేట్ కాగానే దుఃఖం ఆపులేకపోయారు. ప్రతి నిమిషం ప్రాణం పెట్టి ఆడాను. నిద్రలో కూడా బిగ్‏బాస్ షో గెలవాలనే అనుకున్నాను.. కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

అనంతరం స్టేజ్ పైకి వచ్చిన గీతూకి.. తన బిగ్‏బాస్ జర్నీ చూపించాడు నాగార్జున. తన వీడియో చూస్తూ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక తర్వాత బాధపడుతూనే.. ఆది, రేవంత్, సత్య, ఫైమా, శ్రీహాన్ టాప్ 5 అని.. వీరి వల్ల షో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పింది. ఇక ఇనయ, మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి ల గేమ్ తక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. చివరగా నేను పోను.. బిగ్‏బాస్ వదిలి వెళ్లను అంటూ ఏడుస్తూ స్టేజ్ పైనే కూర్చుండిపోయింది. ఆమెను ఓదార్చడం నాగార్జున వల్ల కాలేదు. ఆమె ఏడుస్తుంటే చూస్తూ నిల్చుండిపోయాడు. మొదటి రెండు వారాలు గీతూ తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాతి వారం నుంచి ఆమె గ్రాఫ్ స్లోగా పడిపోయింది. ముఖ్యంగా గతవారం గీతూ తన ఆట తీరు..ప్రవర్తనపై విసుగు చెందారు ఆడియన్స్. బాలాదిత్యతో సిగరెట్స్ గొడవ.. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే బాలాదిత్య గీతూ వల్ల వెక్కి వెక్కి ఏడవడం.. పూర్తిగా నమ్మి స్నేహం చేసిన ఆదిరెడ్డిని తన బుద్దిబలంతో వెన్నుపోటు పొడవడం గీతూకు మైనస్ అయ్యాయనే చెప్పుకోవాలి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు