AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: ఎన్టీఆర్‏తో కాంతార డైరెక్టర్ సినిమా చేయనున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన రిషబ్ శెట్టి..

కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని విక్షించిన తారక్ రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని స్వయంగా రిషబ్ తెలియజేశారు.

Kantara: ఎన్టీఆర్‏తో కాంతార డైరెక్టర్ సినిమా చేయనున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన రిషబ్ శెట్టి..
Rishab Shetty, Ntr
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2022 | 7:34 AM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా కాంతార హవా కొనసాగుతుంది. నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ మూవీకి పాన్ ఇడియా లెవల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సౌత్ టూ నార్త్ భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రంపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో సప్తమిగౌడ్ హీరోయిన్‏గా నటించింది. కాంతారలో ప్రధాన పాత్రలో నటించిన రిషబ్ శెట్టి.. స్వయంగా దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని విక్షించిన తారక్ రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని స్వయంగా రిషబ్ తెలియజేశారు.

అయితే కొద్దిరోజులుగా వీరిద్దరి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ వార్తలపై స్పందించారు రిషబ్ శెట్టి. కాంతార సినిమాను తారక్ చూసి ఫోన్ చేసి అభినందించారు. నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. ప్రస్తుతం తారక్‍తో సినిమా తెరకెక్కించే ఆలోచన చేయలేదని.. ముందు కథ, కాన్సెప్ట్ సెలక్ట్ చేసిన తర్వాతే నటీనటుల ఎంపిక గురించి ఆలోచిస్తాను అన్నారు. “ముందుగా నటుడిని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ డెవలప్ చేయడం రాదు కథ రాయం పూర్తయిన తర్వాతే నటీనటుల ఎంపిక గురించి ఆలోచిస్తాను” అని అన్నారు రిషబ్ శెట్టి.

ప్రస్తుతం తాను రెండు నెలలు విరామం తీసుకుంటానని.. ఆ తర్వాతే తన తదుపరి చిత్రాల గురించి ఆలోచిస్తానని అన్నారు రిషబ్ శెట్టి. అలాగే కాంతార 2 చిత్రం గురించి ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేదని.. కాంతార విడుదలై 35 గడుస్తున్నా.. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నాం… కాబట్టి కేవలం ఇప్పుడు కాంతార సినిమా గురించి మాట్లాడతాను అని అన్నారు. 2016లో ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కిరిక్ పార్టీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతో నేషనల్ క్రష్ రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం