Arjun Sarja: 40ఏళ్ల కేరీర్‌లో ఇలాంటోడిని చూడలేదు.. విశ్వక్ సేన్ విరుచుకుపడ్డ యాక్షన్ కింగ్
విశ్వక్ వ్యవహారశైలిపై సీనియర్ నటుడు అర్జున్ ఆరోపణలు అందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఆయన నిర్మాణ సారథ్యంలో ఓ సినిమాకు విశ్వక్‌సేన్ సైన్ చేశారు
విశ్వక్‌సేన్.. ఓ వర్ధమాన నటుడు. అతికొద్ది సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో కాస్త పేరుసంపాదించాడు. కేరీర్‌లో ఎదుగుతున్న దశలోనే వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నట్లు ఆయనపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. విశ్వక్ వ్యవహారశైలిపై సీనియర్ నటుడు అర్జున్ ఆరోపణలు అందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఆయన నిర్మాణ సారథ్యంలో ఓ సినిమాకు విశ్వక్‌సేన్ సైన్ చేశారు. మూడునెలల క్రితం సినిమా షూటింగ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు అర్జున్. సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన పవన్‌కల్యాణ్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మూవీ ఓపెనింగ్‌కు ప్రముఖ దర్శకుడు రాఘవేందర్‌రావు, సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు సైతం హాజరై సినిమా సక్సెస్ కావాలని దీవించారు. అనంతరం రెండు, మూడు షెడ్యూల్స్ చిత్రీకరణకూడా పూర్తయింది.
అంతా స్మూత్‌గా సాగుతున్న సమయంలో సడన్‌గా ఏం జరిగిందో ఏమో తెలియదుగాని.. విశ్వక్‌సేన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన అర్జున్.. విశ్వక్‌కు వందలసార్లు కాల్ చేశారు. షూటింగ్‌కు రావాలని రిక్వెస్ట్ చేశారు. అయినా విశ్వక్.. షూటింగ్‌కు రాకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. స్టోరీ, రెమ్యునరేషన్‌పై అగ్రిమెంట్ చేశాక చివరి నిమిషంలో షూటింగ్‌కు రానంటూ సడెన్‌గా మెసేజ్ పెట్టడంపై ఆవేదన చెందారు. ఇంత అన్ ప్రొఫెషనలిజామా అంటూ ఫైరయ్యారు. విశ్వక్ కారణంగా జగపతిబాబు లాంటి సీనియర్ల డేట్స్‌కూడా వేస్ట్ అయినట్లు చెప్పారు. ఇలాంటి నటుడిని తన 40ఏళ్ల కేరీర్‌లో చూడలేదన్నారు.
సినిమా షూటింగ్ మరికొద్దిరోజుల్లో పూర్తవుతుందనగా.. విశ్వక్ జలక్‌తో షాకయ్యారు అర్జున్. ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నారు. విశ్వక్ వల్ల తాను, తన చిత్రయూనిట్ పడిన ఇబ్బందులపై ఇప్పటికే సినీపెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ చాంబర్‌లోనూ కంప్లైంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా అర్జున్- విశ్వక్ సినిమా వివాదంలో మరిన్ని ట్విస్టులు ఖాయంగా కనిపిస్తోంది.