Sharwanand: సిద్ధార్థ్.. అదితి రావ్ రిలేషన్‏పై బాలయ్య ప్రశ్నలు.. పోస్ట్ చూసి నాకేం అర్థం కాలేదంటున్న శర్వానంద్..

ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ రిలేషన్ పై పలు ప్రశ్నలు అడగ్గా శర్వానంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Sharwanand: సిద్ధార్థ్.. అదితి రావ్ రిలేషన్‏పై బాలయ్య ప్రశ్నలు.. పోస్ట్ చూసి నాకేం అర్థం కాలేదంటున్న శర్వానంద్..
Balakrishna, Sharwanand
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2022 | 8:13 AM

తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు సెకండ్ సీజన్‏కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో నారా చంద్రబాబు, సెకండ్ ఎపిసోడ్ లో సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ రాగా.. తాజాగా మూడవ ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ అడివి శేష్, శర్వానంద్ విచ్చేశారు. అయితే ఈ ఇద్దరు కుర్రహీరోలను బాలయ్య తనదైన శైలిలో ఓ ఆటాడుకున్నారు. పంచులు, ప్రాసలతో బాలయ్య ఆటపట్టించగా.. ఇక శర్వానంద్ సైతం పంచులతో అలరించాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ రిలేషన్ పై బాలయ్య పలు ప్రశ్నలు అడగ్గా శర్వానంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మహా సముద్రం సినిమా హీరోయిన్ అదితీ రావు హైదరీ ప్రస్తావన తీసుకువచ్చారు బాలయ్య. మీరు సాధారణంగా హీరోయిన్లను ఎలా ఎంపిక చేసుకుంటారు అని అడగ్గా. ఆ విషయంలో నేను చేసేదేం లేదు. అంతా డైరెక్టర్స్ చెప్పింది చేయడం తప్ప.. నాకు ప్రత్యేకంగా ఎంపిక అంటూ లేదు అంటూ చెప్పుకొచ్చారు శర్వానంద్. మరీ అదితి రావు సంగతేంటీ ? అని బాలయ్య అడగ్గా.. ఆమె మహా సముద్రం సినిమాలో సిద్ధార్థ్ కి జోడిగా నటించింది. కానీ నాకు జోడీగా నటించలేదు. దానికి బాలయ్య నిజ జీవితంలో కూడా సిద్ధార్థ్ కు జంటగా మారిందా ?.. అని శర్వానంద్ ను అడిగారు.

ఏమో నాకేం తెలియదు.. సిద్ధార్థ్ పోస్ట్ చూశాను. కానీ అది నాకు అర్థం కాలేదు అని అన్నారు శర్వానంద్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అదితి పుట్టిన రోజున నా హృదయ రాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధూ పోస్ట్ చేయడంతో వీరిద్దరి ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. గతంలో వీరిద్దరు కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు కనిపించారు. దీంతో వీరిద్దరి రిలేషన్ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తమ డేటింగ్ రూమర్స్ పై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు.