AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: ‘శారీరకంగా.. మానసికంగా చేయగలిగిదంతా చేశాను.. కానీ ఫలితం దక్కలేదు’.. లైగర్ సినిమాపై విజయ్ కామెంట్స్..

ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్దు మంచి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

Vijay Deverakonda: 'శారీరకంగా.. మానసికంగా చేయగలిగిదంతా చేశాను.. కానీ ఫలితం దక్కలేదు'.. లైగర్ సినిమాపై విజయ్ కామెంట్స్..
Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2022 | 8:12 AM

Share

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాత్ తెరకెక్కించిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మూవీతో దేశవ్యాప్తంగా విజయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాదిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రౌడీ ఆటిట్యూడ్, స్టైల్‏కు ఫిదా అయిపోయారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్దు మంచి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. లైగర్ సినిమా మెప్పించకపోయినా.. విజయ్ నటనపై ప్ర ప్రశంసలు కురిపించారు. అయితే ప్రస్తుతం తన తదుపరి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విజయ్.. తాజాగా లైగర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

లైగర్ సినిమాలో నటించడమే గొప్ప అవకాశమని.. అందులో పోషించిన నత్తి పాత్రను ఆస్వాదించానని అన్నారు. చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దేశమంతా ప్రచారం చేయడం గొప్ప అనుభూతి పంచిందని అన్నారు. లైగర్ సినిమా కోసం మానసికంగా.. శారీరకంగా నేను చేయగలిగినదంతా చేశాను. కానీ ఫలితం దక్కలేదు. తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోడమని.. ఒకవేళ ఎవరైనా తమ తప్పు చేయట్లేదంటే వారు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించినట్టే అని వివరించారు. సక్సెస్ వచ్చినా.. రాకపోయినా ప్రయత్నాన్ని విరమించకూడదని అన్నారు. అనుకున్న ఫలితాన్ని అందుకోని సమయంలోనూ ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. జీవితంలో జయపజయాలు సహజమన్నారు విజయ్.

ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇదే కాకుండా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటించిన సూపర్ హిట్ చిత్రం డీడీఎల్జే సినిమా రీమేక్ లో విజయ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.